శుక్రవారం 29 మే 2020
Cinema - Mar 28, 2020 , 15:24:24

ఏఆర్ రెహ‌మాన్‌ మ్యూజిక్ టూర్ వాయిదా

ఏఆర్ రెహ‌మాన్‌ మ్యూజిక్ టూర్ వాయిదా

ముంబై: ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ టూర్‌ను వాయిదా వేసుకున్నారు. క‌రోనా వ్యాప్తి పెరుగుతున్న నేప‌థ్యంలో..ఈ ఏడాది ఉత్త‌రమెరికాకు మ్యూజిక్ టూర్ షెడ్యూల్ ను వాయిదా వేసుకున్న‌ట్లు ఏఆర్ రెహ‌మాన్ తెలిపారు. సెల్ఫ్ ఐసోలేష‌న్ అవ‌స‌రాన్ని తెలియ‌జేస్తూ ఏఆర్ రెహ‌మాన్ త‌న అభిమానుల‌కు ఓ సందేశం పంపారు. 

న‌న్ను ఎంత‌గానో అభిమానించే ఫ్యాన్స్ కు సంగీతాన్ని అందించ‌డం కంటే ముఖ్య‌మైనదేది నాకు లేదు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో మ‌న‌మంతా మ‌న ఇంటికి ప‌రిమిత‌మై..ఫ్యామిలీల‌తో ఉండాలి. మీరు ఆరోగ్యం కోసం,  మీరు క్షేమంగా ఉండేందుకు, అలాగే నా అభిమానులు, నా కుంటుంబం, నా మ్యూజిక్ బ్యాండ్ టీం కోసం టూర్ ను వాయిదా వేసుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు ఏఆర్ రెహ‌మాన్‌. 


logo