శుక్రవారం 03 జూలై 2020
Cinema - Apr 09, 2020 , 12:36:13

రెహ‌మాన్ సైలెంట్ పంచ్‌.. వైర‌ల్ అవుతున్న ట్వీట్

రెహ‌మాన్ సైలెంట్ పంచ్‌.. వైర‌ల్ అవుతున్న ట్వీట్

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్ స్వ‌ర‌ప‌ర‌చిన పాట‌లు శ్రోత‌ల‌కి ఎంత‌టి ఆనందం క‌లిగిస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న స్వ‌ర‌ప‌చిన బాణీల‌లో మసక్క‌లి పాట ఒక‌టి. దిల్లీ 6 చిత్రం నుండి విడుద‌లైన ఈ పాట  అప్పట్లో పెద్ద మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. ఈ పాటను మోహిత్‌ చౌహాన్‌ పాడగా, ప్రసూన్‌ జోషి సాహిత్యం అందించారు.  సోనమ్‌ కపూర్‌, అభిషేక్‌ బచ్చన్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన దిల్లీ 6  సినిమాకు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించారు.  

ఇటీవల మ‌స‌క్క‌లి పాటని రీమిక్స్ చేశారు. మ‌స‌క్క‌లి 2 పాట‌తో రూపొందిన ఈ సాంగ్‌ని త‌నీష్ బాగ్చి రూపొందించారు. సిద్ధార్ద్ మ‌ల్హోత్రా, తారా సుతారియా సాంగ్‌కి ఆడి పాడారు. ఈ పాట‌కి నెటిజ‌న్స్ నుండి మిక్స్‌డ్ స్పంద‌న ల‌భించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు త‌న ట్విట్ట‌ర్ ద్వారా మ‌స‌క్క‌లి ఒరిజిన‌ల్ పాట వినండి అని తెలిపారు. ఒక పాట‌ని రూపొందించ‌డానికి నిద్ర లేని రాత్రులు గ‌డ‌పాల్సి వ‌స్తుంది. కొన్ని సార్లు పాట‌ని మార్చి మార్చి రూపొందించాల్సి వ‌స్తుంది. ఈ పాట కోసం 200 మంది క‌ళాకారులు ప‌ని చేశారు. టీం డైరెక్ట‌ర్, డ్యాన్స‌ర్స్, లిరిసిస్ట్‌, కంపోజ‌ర్‌, యాక్ట‌ర్స్ ఎంత‌గానో ప‌ని చేశారు. ఒక్క‌సారి ఒరిజిన‌ల్ వ‌ర్షెన్ కూడా వినండ‌ని  రెహమిన్ త‌న ట్వీట్లో పేర్కోన్నారు

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo