మంగళవారం 07 జూలై 2020
Cinema - Apr 07, 2020 , 08:46:31

సంగీత ద‌ర్శ‌కుడి మృతికి సంతాపం తెలిపిన‌ ఏఆర్ రెహ‌మాన్

సంగీత ద‌ర్శ‌కుడి మృతికి సంతాపం తెలిపిన‌ ఏఆర్ రెహ‌మాన్

 గ‌త కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న 84 ఏండ్ల అర్జునన్ సోమ‌వారం కొచ్చిలోని త‌న నివాసంలోనే తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే . అర్జున‌న్‌ మాస్టర్‌గా పిలవబడే ఈ కేర‌ళ సంగీత ద‌ర్శ‌కుడు దాదాపు  700 పైగా పాటలకు సంగీతాన్ని అందించారు. మాలయాళ చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా ఆయ‌న తనకంటూ ఒక ప్ర‌త్యేక‌త‌ను ఏర్ప‌ర్చుకున్నారు. 1968లో 'కరుత పౌర్ణమి' అనే మలయాళ సినిమాలోని పాటలకు సంగీతం అందించ‌డం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు.  

అర్జున‌న్ మాస్ట‌ర్ మృతిపై ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఏ ఆర్ రెహ‌మాన్ స్పందించారు.  నా బాల్యంలో మీరు నాకు ఇచ్చిన ప్రేమను, ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరచిపోలేను.మీ  శ్రావ్యమైన పాటలు మీ నిత్య వారసత్వానికి నిదర్శనం. అర్జునన్ మాస్టర్ మీ ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ స‌భ్యుల‌కి, స్నేహితుల‌కి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని రెహమాన్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 


logo