శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Cinema - Aug 09, 2020 , 22:15:30

రజినీ నట జీవితానికి 45 ఏండ్లు.. ప్రత్యేక పోస్టర్‌ అంకితమిచ్చిన ఏఆర్‌ రెహమాన్‌

రజినీ నట జీవితానికి 45 ఏండ్లు.. ప్రత్యేక పోస్టర్‌ అంకితమిచ్చిన ఏఆర్‌ రెహమాన్‌

ముంబై : సౌత్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ 45 ఏండ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆదివారం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్ ఆదివారం తన ట్విట్టర్‌లో తలైవాకు ప్రత్యేక పోస్టర్‌ను అంకితం చేశారు. 69 ఏండ్ల రజినీకాంత్ అలనాటి చిత్రాల స్టిల్స్‌తోపాటు ఈ ఏడాది నటించిన 'దర్బార్' చిత్రంలోని సూర్యుడు ఉదయిస్తుండగా చొక్కా కాలర్ ఎత్తి పట్టుకొని నవ్వుతున్న స్టిల్‌ను మేళవించి ఈ పోస్టర్‌ను ఆకర్షణీయంగా రూపొందించారు. రోబో చిత్రంలోని ‘చిట్టి’, ‘రోబోట్’.. శివాజీ చిత్రంలో రజినీ ఎంతో ఇష్టపడే (గుండూ బాస్‌) పాత్రల ఫొటోలను ప్రదర్శించారు. పర్వతాన్ని అధిరోహిస్తున్న వ్యక్తుల సమూహం తలైవా 45 ఏండ్ల సినీ ప్రయాణాన్ని సూచించేలా ఉంది. 

రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. తెలుగు, తమిళ్‌, బాలీవుడ్ సినిమాల్లో ఆయన నటించారు. నటనతోపాటు నిర్మాతగా, స్క్రీన్ రైటర్‌గానూ పని చేశారు. నటుడిగా తన కెరీర్‌లో సూపర్‌స్టార్‌  అనేక అవార్డులు అందుకున్నాడు. 2014లో జరిగిన 45వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ సెంటెనరీ అవార్డు' ఇచ్చి ఆయనను గౌరవించారు. 2019లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 50వ ఎడిషన్‌లో ‘ఐకాన్ ఆఫ్ గ్లోబల్ జూబ్లీ’ అవార్డుతో సత్కరించారు.

logo