బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 28, 2020 , 13:23:21

అడ‌వి రాముడు ఆహా అనిపిస్తే, బాహుబ‌లి సాహో అనిపించింది

అడ‌వి రాముడు ఆహా అనిపిస్తే, బాహుబ‌లి సాహో అనిపించింది

శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు కె రాఘ‌వేంద్ర‌రావు త‌న‌ జీవితంలో ఏప్రిల్ 28 అనేది ఓ మ‌ర‌పు రాని రోజు అని చెప్పుకొచ్చారు. 43 ఏళ్ల క్రితం నంద‌మూరి తార‌క‌రామారావు హీరోగా అడ‌వి రాముడు అనే చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా, ఈ చిత్రం ఎంత పెద్ద సెన్సేష‌న్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సినీ ప్రపంచంలో ఉన్న అన్ని రికార్డుల‌ని తిర‌గ‌రాస్తూ, కొత్త రికార్డుల‌కి శ్రీకారం చుట్టింది. నేటితో అడ‌వి రాముడు విడుద‌లై 43 ఏళ్ళు పూర్తైన సంద‌ర్భంగా రాఘవేంద్ర‌రావు చిత్ర నిర్మాత‌ల‌కి, న‌టీన‌టుల‌కి, డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌కి శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఇక ఏప్రిల్ 28న రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్పించిన బాహుబ‌లి 2 చిత్రం విడుద‌లై తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటేలా చేసింది. నా జీవితంలో అపురూప‌మైన ఈ రెండు చిత్రాలు ఏప్రిల్ 28న విడుద‌ల కావ‌డం సంతోషాన్ని క‌లిగిస్తుంది. రెండు పండుగ‌ల‌ని ఒకే రోజు అందించిన ఏప్రిల్ 28 క‌రోనా మ‌హ‌మ్మారిని తుద‌ముట్టించ‌డానికి వేదిక‌గా మారాల‌ని ఆశిస్తూ.. అదే నిజ‌మైన వేడుక అని భావిస్తూ..  ఈ మ‌హాయ‌జ్ఞంలో పాలు పంచుకుంటున్న వైద్య సిబ్బందికి, పోలీస్ విభాగానికి, పారిశుద్ధ్య కార్మికుల‌కి ధ‌న్య‌వాదాలు తెలిపారు ద‌ర్శ‌కేంద్రుడు. 


logo