ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 00:24:30

తోలుబొమ్మల సిత్రాలు

తోలుబొమ్మల సిత్రాలు

సినిమా పుట్టుకకు బీజమైన తోలుబొమ్మలాట మీద అభిమానంతో ఆ కళా రూపాన్ని తన సంస్థ  పేరుగా పెట్టడం అభినందనీయమని అన్నారు ఏపీ రాష్ట్ర మంత్రి ఎస్‌.బి. అంజద్‌ బాషా. తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్‌పై కోమారి జానకిరామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. కోమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్నారు.  ఈ చిత్ర బ్యానర్‌ లోగోను ఇటీవల మంత్రి ఎస్‌.బి. అంజద్‌బాషా ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సందేశాత్మక కథాంశంతో సినిమాను రూపొందిస్తున్నాం. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇతర వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని చెప్పారు.

logo