మోనాల్ ను డేట్ కు తీసుకెళ్లాల‌ని చెప్పిన‌ బిగ్ బాస్..!

Nov 25, 2020 , 21:08:32

ఈ మోనాల్ ఎక్కడి నుంచి వచ్చిందిరా నా జీవితంలోకి..ఆ పేరు వచ్చినపుడల్లా నాకు ఏదో ఒక‌ రాడ్ పడుతుంది..ఈ మాటలు అన్నది ఎవరో కాదు అభిజీత్. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో అందరికంటే ఎక్కువ క్రేజ్ ఈయనకే ఉంది. విన్నర్ కూడా ఈయనే అవుతాడని అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు అభిజీత్, మోనాల్ మధ్య మళ్లీ స్నేహంపై బిగ్ బాస్ మరోసారి ఆడుకున్నాడు. మరోవైపు అఖిల్ కూడా మోనాల్ తో కాస్త గ్యాప్ మెయింటేన్ చేస్తున్నాడు. నీతో రిలేషన్ వల్ల నా ఆట చెడిపోతుంది అంటూ మోనాల్ తోనే నేరుగా చెప్పేసాడు అఖిల్. దాంతో ఇద్దరి మధ్య మునపటి రిలేషన్ అయితే కనిపించడం లేదు.

అఖిల్ తో గ్యాప్ వచ్చిన తర్వాత అభిజీత్ తో క్లోజ్ అవుతుంది మోనాల్. అంతేకాదు మోనాల్ ఇంట్లో అభిజీత్ నచ్చాడు. మొన్న స్టేజీపై మోనాల్ తల్లి తనకు అభి నచ్చిన కంటెస్టెంట్ అంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు మోనాల్ అంటే తనకు యిష్టమని అభి తండ్రి చెప్పాడు. దాంతో ఇద్దరూ ఇప్పుడు మంచి స్నేహితులు అయిపోయారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ కూడా ఈ జంటతో ఆడుకుంటున్నాడు. తాజాగా ఇంట్లో ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. 

అందులో భాగంగా అఖిల్, అభిజీత్ కారణంగా మోనాల్ చాలాసార్లు బాధ పడింది.. అందుకే మీ ఇద్దరే ఇప్పుడు ఆమెను సంతోషపరచాల్సిన బాధ్యత మీపైనే ఉందంటూ చెప్పాడు బిగ్ బాస్. ఇద్దరిలో ఎవరో ఒకరు ఆమెను డేట్ కు తీసుకెళ్లాలని చెప్పుకొచ్చాడు. దాంతో అఖిల్ పరిస్థితేంటో కానీ అభి మాత్రం చాలా సీరియస్ అయ్యాడు. అసలు మోనాల్ ను ఎందుకు తనతో కనెక్ట్ చేస్తారని ఎమోషనల్ అయ్యాడు. ఎందుకు తనతో మోనాల్ ను కనెక్ట్ చేసి ఇబ్బంది పెడుతున్నారంటూ ఏడ్చేసాడు అభిజీత్. ఇంత జరుగుతున్నా కూడా తనతో ఏం సంబంధం లేదన్నట్లు డేట్ కు రెడీ అయింది మోనాల్ గజ్జర్. మరి బిగ్ బాస్ లో ఈ డేట్ డ్రామా ఎలా ఉండబోతుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD