మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 06, 2020 , 09:36:09

రేర్ కాంబినేష‌న్ తెర‌పైకి..!

రేర్ కాంబినేష‌న్ తెర‌పైకి..!

వెండితెర‌పై కొన్ని కాంబినేష‌న్స్ సంచ‌ల‌నాలు సృష్టిస్తుంటాయి. ఈ నేప‌థ్యంలో వారిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఎక్కువ‌గా సినిమాలు రావాల‌ని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో రేర్ కాంబినేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ నడుస్తుంది.

విజయ్‌ దేవరకొండ–అనుష్క కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంద‌ని ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇంట్రెస్టింగ్ కథని ఇద్ద‌రికి వినిపించ‌డంతో, దానికి ఇంప్రెస్ అయిన విజ‌య్, అనుష్క‌లు సినిమా చేసేందుకు అంగీక‌రించార‌ని స‌మాచారం. మూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు అతి త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అనుష్క రీసెంట్‌గా నిశ్శబ్ధం చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్‌, సుకుమార్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు.


logo