మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 21, 2021 , 07:53:37

తదుప‌రి సినిమా కోసం కొత్త గెట‌ప్‌లోకి మార‌నున్న అనుష్క‌..!

తదుప‌రి సినిమా కోసం కొత్త గెట‌ప్‌లోకి మార‌నున్న అనుష్క‌..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క త‌న ప్ర‌తి సినిమాలోను ఎంతో కొంత  వైవిధ్యం చూపిస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా పాత్ర కోసం త‌న శ‌రీరాకృతి  మార్చుకుంటూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది . సైజ్ జీరో చిత్రం కోసం భారీగా బ‌రువు పెరిగిన అనుష్క త‌ర్వాతి చిత్రం కోసం మ‌ళ్ళీ త‌గ్గింది. అనుష్క క‌ష్టాన్ని చూసి అభిమానులు ఆందోళ‌న చెందారు.  ఆమె బ‌రువు త‌గ్గేందుకు యోగ‌స‌నాలు, ప్ర‌కృతి వైద్యాల‌తో పాటు పలు క‌స‌ర‌త్తులు కూడా చేసింది.

సినిమాని ప్రాణంగా ప్రేమించే వారిలో అనుష్క కూడా ఒక‌రు. పాత్ర న‌చ్చితే ఎంత‌టి క‌ష్టానికైన సై అనే అనుష్క ఇప్పుడు మ‌రోసారి త‌న బాడీ మేకొవ‌ర్‌కు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. నిశ్శ‌బ్దం చిత్రం త‌ర్వాత అనుష్క.. రారా కృష్ణ‌య ఫేమ్ పి మ‌హేష్ ద‌ర్శక‌త్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధ‌మైంది అనుష్క‌. ఈ సినిమాలో అనుష్క గ‌తంలో ఎప్పుడు క‌నిపించ‌ని లుక్‌లో క‌నిపిస్తుంద‌ట‌. స‌రికొత్త లుక్‌లో క‌నిపించేందుకు స్వీటీ ఇప్ప‌టికే వ‌ర్క‌వుట్స్ మొద‌లు పెట్టింద‌ని టాక్. యూవీ క్రియేష‌న్స్ బేన‌ర్ నిర్మించ‌నున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు అతి త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

VIDEOS

logo