బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 00:54:45

అంతా అనుకున్నట్లే!

అంతా అనుకున్నట్లే!

‘జీవితం ఒక గాజుబొమ్మలా అతిసున్నితమైనది. పరిసరాలు ఎప్పుడూ మన ఆధీనంలో ఉండవు.  అందరం ప్రతిక్షణం ఏదో తెలియని అనిశ్చితిలోనే జీవిస్తుంటాం. ఈ విషయం పట్ల స్పృహతో ఉంటూ మనుషులపై ప్రేమ కనబరుస్తూ ప్రతిక్షణాన్ని ఆనందమయం చేసుకోవాలి. లాక్‌డౌన్‌ కాలంలో నేను తెలుసుకున్న సత్యమిదే’ అని చెప్పింది సీనియర్‌ కథానాయిక అనుష్కశెట్టి. ఇటీవలే ఈ మంగళూరు అమ్మడు ట్విట్టర్‌లో జాయిన్‌ అయింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. లాక్‌డౌన్‌ టైమ్‌లో మీరు ఏం నేర్చుకున్నారని ఓ అభిమాని అడిగినప్పుడు పై విధంగా తాత్వికధోరణిలో సమాధానం చెప్పింది. తన జీవితంలో ఎప్పుడూ పశ్చాత్తాప పడిన సందర్భం లేదని, అంతా కోరుకున్న విధంగానే జరిగిందని..కెరీర్‌లో ఈ స్థాయికి రావడం గొప్పవరంగా భావిస్తున్నానని తెలిపింది. తన కెరీర్‌లో సూపర్‌, అరుంధతి, వేదం, రుద్రమదేవి, భాగమతి, సైజ్‌జీరో, బాహుబలి, నిశ్శబ్దం చిత్రాలు వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చాయని పేర్కొంది. భాషాపరంగా తనకు ఎలాంటి ప్రాధామ్యాలు లేవని,  అర్థవంతమైన పాత్రలు చేయాలన్నదే నటిగా లక్ష్యమని చెప్పింది. ప్రభాస్‌తో కలిసి మళ్లీ ఎప్పుడు నటిస్తారని ఓ అభిమాని అడగ్గా.. ఇద్దరికి సరిపోయే కథ కుదిరితే తప్పకుండా ఇద్దరి జోడీని తెరపై మరలా చూస్తారని బదులిచ్చింది.



logo