శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 09:52:00

ఈ ఫోటొపై అనుష్క రియాక్ష‌న్ ఏంటంటే..!

ఈ ఫోటొపై అనుష్క రియాక్ష‌న్ ఏంటంటే..!

అందాల భామ అనుష్క చేసింది త‌క్కువ సినిమాలే అయిన భారీ క్రేజ్‌ని సంపాదించుకుంది. ఇటీవ‌ల నిశ్శ‌బ్ధం అనే థ్రిల్ల‌ర్ చిత్రంతో ప‌ల‌క‌రించింది. ఈ సినిమా అంతగా స‌క్సెస్ కాక‌పోయిన అనుష్క న‌ట‌న‌కు మాత్రం మంచి మార్కులు ప‌డ్డాయి. అయితే రీసెంట్‌గా ట్విట్ట‌ర్‌లోకి అడుగుపెట్టిన ఈ అమ్మ‌డు త‌న అభిమానుల‌తో ముచ్చ‌టించింది. నెటిజ‌న్స్ అడిగిన ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చింది. 

అయితే ఓ నెటిజ‌న్ మిర్చి సినిమా షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌భాస్, అనుష్క‌లు పెళ్ళి పీట‌ల‌పై ఉన్న ఫోటోని షేర్ చేస్తూ దీనిపై మీ రియాక్ష‌న్ ఏంట‌ని అడిగాడు. ఇందుకు అనుష్క‌.. ఇది మిర్చి సినిమా షూటింగ్‌లో స‌న్నివేశం. సీన్ గురించి మాట్లాడుకున్న‌ప్పుడు తీసిన అంద‌మైన ఫోటో ఇది. మిర్చి నా హృద‌యానికి చేరువైన చిత్రం .  యూవీ క్రియేషన్స్ వారి మొదటి చిత్రం. ప్రమోద్‌, వంశీ, విక్కి మంచి మనసున్న నిర్మాతలు అంటూ అనుష్క త‌న అభిప్రాయాన్ని తెలియ‌జేసింది.  ప్ర‌స్తుతం అనుష్క ఖాతాలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉండ‌గా, ఆ చిత్ర షూటింగ్ వ‌చ్చే ఏడాది మొద‌లు పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం.