మంగళవారం 02 జూన్ 2020
Cinema - Mar 16, 2020 , 21:37:13

అనుష్కశర్మ హాట్‌.. హాట్‌.. ఫొటోషూట్‌!

అనుష్కశర్మ హాట్‌.. హాట్‌.. ఫొటోషూట్‌!

పెండ్లయితే అవకాశాలు తగ్గిపోతాయంటారు. కానీ బాలీవుడ్‌ ఇండస్ట్రీ లేడీస్‌కి ఈ మాట వర్తించదనుకుంటా. రోజురోజుకు అందం రెట్టింపు అవుతుంది. అంతకుమించి అవకాశాలు ఎక్కువ అవుతున్నాయనడానికి అనుష్కశర్మ ఈ ఫొటోషూటే నిదర్శనం. రాకుమారిలా తెల్లని దుస్తుల్లో అందంగా మెరిసిపోతున్నది కదా.. అనుష్కశర్మ. ఒక మ్యాగజైన్‌ కవర్‌ పేజీ కోసం హాట్‌.. హాట్‌గా ఫొటోలకు ఫోజులిచ్చింది.

అల్లియా ఆల్‌ రుఫాయి స్టయిలింగ్‌ చేసిన తెల్లని దుస్తుల్లో మెరిసిపోయింది. డీప్‌ నెక్‌ లైన్‌, స్లిట్‌ కట్‌ వచ్చిన లాంగ్‌ గౌన్‌తో చిన్న స్టూల్‌ మీద కూర్చొని కూల్‌ లుక్‌తో దర్శనమిచ్చింది. మామూలుగా అనుష్క జువెలరీ ప్రియురాలు. కానీ ఈ ఫొటోషూట్‌కి జువెలరీ లేకుండా తన లుక్స్‌తోనే ఆ అందాన్నితీసుకొచ్చింది. పొట్టి జుట్టుతో, మధ్య పాపిటతో కొత్త అవతారంలో కనిపించింది. ఎక్కువగా పింక్‌ టచప్స్‌,పింక్‌ లిప్‌ షేడ్‌ ఆమెను మరింత అందంగా చూపిస్తున్నాయి. 


logo