బుధవారం 03 జూన్ 2020
Cinema - May 03, 2020 , 12:45:24

నెత్తుటితో అనుష్క‌.. న‌వ్వుతున్న అంజ‌లి

నెత్తుటితో అనుష్క‌.. న‌వ్వుతున్న అంజ‌లి

అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో హేమంత్ మ‌ధుక‌ర్ తెర‌కెక్కించిన చిత్రం నిశ్శ‌బ్ధం. ఏప్రిల్ 2న విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం లాక్‌డౌన్ వ‌ల‌న వాయిదా ప‌డింది. ఈ సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందో తెలియ‌ని పరిస్థితి. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి పుకార్లు షికారు చేయ‌గా, వాటిని నిర్మాత‌లు కొట్టిపాడేశారు. ఇక ‌ చిత్రంలో మాధవన్, అంజలి, హాలీవుడ్ నటుడు మ్యాడ్‌సన్, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు, కిల్ బిల్‌  కీల‌క పాత్ర‌లు పోషించారు. 

చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్న అంజ‌లి త‌న ట్విట్ట‌ర్ ద్వారా చిత్రానికి సంబంధించిన ఫోటోని షేర్ చేసింది. ఇది షూట్ లాస్ట్‌డే పిక్ అంటూ పోస్ట్ చేసింది. ఇందులో నెత్తుటితో ఉన్న సుబ్బ‌రాజు సెల్ఫీ తీస్తుండ‌గా అంజ‌లితో పాటు పోలీస్ డ్రెస్‌లో ఉన్న కొంద‌రు న‌వ్వుతూ క‌నిపించారు. అనుష్క నెత్తికి కూడా నెత్తుటి మ‌ర‌కలు క‌నిపిస్తుండ‌గా, ఆ స‌న్నివేశం ఏదో యాక్ష‌న్ స‌న్నివేశానికి సంబంధించిన‌ది అయి ఉంటుందని నెటిజ‌న్స్ భావిస్తున్నారు . తెలుగు, త‌మిళం, ఇంగ్లీష్‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు


logo