బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 27, 2020 , 09:12:52

బిగ్ బాస్ స్టేజ్‌పై సంద‌డి చేయ‌నున్న అనుష్క‌..!

బిగ్ బాస్ స్టేజ్‌పై సంద‌డి చేయ‌నున్న అనుష్క‌..!

అందాల భామ అనుష్క న‌టించిన తాజా చిత్రం నిశ్శ‌బ్ధం. అమెజాన్ ప్రైమ్ ద్వారా అక్టోబర్ 2న చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మూగ పెయింటర్‌‌‌గా విభిన్న పాత్రలో అనుష్క నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా అనుష్కతో పాటు మూవీ బృందం బిగ్ బాస్ స్టేజ్‌పై సంద‌డి చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

నిశ్శ‌బ్ధం సినిమా ఓటీటీలో విడుద‌ల కానుండ‌డంతో నిర్మాత‌లు ఎక్కువ ప్ర‌మోష‌న్స్ చేస్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. అయితే బిగ్ బాస్ షోకి వెళితే మూవీకి కావ‌ల‌సినంత ప్ర‌చారం ద‌క్కుతుంద‌ని చిత్ర నిర్మాత‌లు భావించిన‌ట్టు తెలుస్తుండ‌గా, ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున‌, నిశ్శ‌బ్ధం టీం, హౌజ్ మేట్స్ క‌లిసి ప్రేక్ష‌కుల‌కి మ‌రింత వినోదాన్ని అందించ‌నున్నార‌ని స‌మాచారం. చాలాకాలం తర్వాత నాగార్జున, అనుష్యను ఒకే ఫ్రేమ్‌లో చూడబోతున్నామంటూ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

 


logo