గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 19, 2020 , 12:38:15

క‌న్నీరు పెట్టిన అనుష్క‌.. వైర‌ల్ అవుతున్న ప్రోమో

క‌న్నీరు పెట్టిన అనుష్క‌.. వైర‌ల్ అవుతున్న ప్రోమో

లేడీ సూప‌ర్ స్టార్ అనుష్క హీరోల‌కి స‌మానంగా అభిమానుల ఆద‌రాభిమానాలు  ద‌క్కించుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క రీసెంట్‌గా నిశ్శ‌బ్ధం అనే చిత్రంలో న‌టించింది. గ‌త కొద్దిరోజులుగా ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి.ఈ  ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో చురుగ్గా పాల్గొంటుంది అనుష్క . తాజాగా బుల్లితెర‌పై అత్యంత ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన కార్య‌క్ర‌మంకి త‌న టీంతో క‌లిసి హాజ‌రైంది జేజెమ్మ . దీనికి సంబంధించిన  తాజాగా ప్రోమో విడుద‌ల చేశారు.

ప‌లు ట్విస్ట్‌ల‌తో రూపొందిన ఈ ప్రోమో విడుద‌లైన  కొన్ని గంటల్లోనే 1.7 మిలియన్ల వ్యూస్‌ని రాబ‌ట్టింది.  54 వేల లైక్స్‌ని పొందింది. టీవీ షో ప్రోమోకి ఈ రేంజ్‌లో రెస్పాన్స్ రావ‌డాన్ని చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ప్రోమోలో అనుష్క గ్రాండ్ ఎంట్రీ, అరుంధ‌తి సెటప్‌, అనుష్క స‌మాధానాలు ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. సినిమాలు వ‌దిలేస్తారా, ప్ర‌భాస్‌తో స్నేహం పంచుకుంటారా అనే ప్ర‌శ్న‌కి సినిమాలు వదిలేస్తాన‌ని అనుష్క చెప్ప‌డం గ‌మ‌న‌ర్హం. అయితే ప్రోమో చివ‌ర‌లో అనుష్క క‌న్నీరు పెట్టుకోవ‌డంతో సెట్ అంతా సైలెంట్ అయింది. ఇంత‌కు అనుష్క ఎందుకు క‌న్నీరు పెట్టుకుందో తెలియాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వ‌రకు వేచి చూడాల్సిందే. logo