మంగళవారం 26 మే 2020
Cinema - May 21, 2020 , 09:48:28

ఫిలింఫేర్ ట్రోఫీ వేలం వేస్తున్న బాలీవుడ్ ద‌ర్శ‌కుడు

ఫిలింఫేర్ ట్రోఫీ వేలం వేస్తున్న బాలీవుడ్ ద‌ర్శ‌కుడు

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల‌న ప్ర‌పంచం అంతా అతలాకుత‌ల‌మైంది. మందు లేని ఈ రోగం బారిన ప‌డ‌కుండా ఉండాలి అంటే లాక్‌డౌన్ ఒక్క‌టే ప‌రిష్కారం అని భావించిన ప్ర‌భుత్వాలు  దాదాపు 60 రోజుల లాక్‌డౌన్ కొన‌సాగించాయి. దీని వ‌ల‌న ఆర్ధిక సంక్షోభం కూడా త‌లెత్తింది. అనేక మంది నిరాశ్ర‌యుల‌య్యారు. వీరిని ఆదుకునేందుకు సినీ  ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖులు కూడా న‌డుం బిగించారు. 

ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ మ‌న దేశంలో కోవిడ్ 19 టెస్ట్ కిట్ల‌ని కొనుగోలు చేసేందుకు నిధులు సేక‌రిస్తున్నారు. ఇందుకోసం క‌శ్యప్ ..గ్యాంగ్స్ ఆఫ్ వ‌స్సేపూర్ చిత్రానికి అందుకున్న ఫిలింఫేర్ అవార్డ్ ట్రోఫీని వేలం వేయ‌నున్నాడు. హాస్యనటులు కునాల్ కమ్రా, వరుణ్ గ్రోవర్ తమ యూట్యూబ్ బటన్లు, ట్రోఫీలను అనురాగ్ కశ్యప్‌తో పాటు వేలం వేయనున్నారు. ఈ వేలం ద్వారా 13 ల‌క్ష‌ల రూపాయల నిధులని సేక‌రించాల‌ని వారు భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది.  వ‌చ్చిన మొత్తంతో క‌రోనా కిట్స్‌ని కొనుగోలు చేసి వారియ‌ర్స్‌కి అంద‌జేయ‌నున్నారు. 


logo