బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 15, 2020 , 00:16:09

తెర వెనకే మ్యాజిక్‌ !

తెర వెనకే మ్యాజిక్‌ !

సాధారణంగా కథానాయికలు సెట్స్‌లో అడుగుపెట్టారంటే  తమ పాత్ర గురించే ఆలోచిస్తారు.  తెర వెనక జరిగే తతంగం గురించి అంతగా పట్టించుకోరు. అయితే మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌కు మాత్రం తెర వెనక ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సుకత ఎప్పటి నుంచో ఉందట. అందుకే ఈ అమ్మడు తాను కథానాయికగా నటిస్తున్న ‘మణియారాయిలే అశోకన్‌' అనే  మలయాళ చిత్రానికి సహాయ దర్శకురాలిగా  అవతారమెత్తింది. అనుపమ మాట్లాడుతూ ‘స్వతహాగా నాకు దర్శకత్వంపై మక్కువ ఉంది. కానీ నాయికగా బిజీగా ఉండటం వల్ల  కుదరలేదు. అందుకే ఈ సినిమాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నా. నా దృష్టిలో స్క్రీన్‌పై కనిపించే అద్భుత దృశ్యం తాలూకు మ్యాజిక్‌ అంతా తెర వెనకే సృష్టించబడుతుంది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేయడంతో పాటు నిర్మాణానంతర కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకున్నా. ఎంతో ఇష్టపడి పనిచేశాను కాబట్టి సెట్‌లో ఎప్పుడూ కష్టంగా అనిపించలేదు. నా తొలిచిత్రం ‘ప్రేమమ్‌' నుంచి దర్శకత్వ విభాగంలో పనిచేయాలనే కోరిక ఉండేది. ఇప్పుడు ఆ కల నెరవేరింది. భవిష్యత్తులో అవకాశమొస్తే సినిమాకు దర్శకత్వం చేస్తా’ అని చెప్పింది అనుపమ పరమేశ్వరన్‌.

తాజావార్తలు


logo