గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 00:10:27

అనూప్‌ సంగీతంతో

అనూప్‌ సంగీతంతో

మేఘాంశ్‌ శ్రీహరి, సమీర్‌ వేగేశ్న కథానాయకులుగా    నటిస్తున్న చిత్రం ‘కోతికొమ్మచ్చి’. వేగేశ్న సతీష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్యప్రొడక్షన్స్‌ పతాకంపై ఎం.ఎల్‌.వి సత్యనారాయణ(సత్తిబాబు) నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతాన్ని అందించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. కథానుగుణంగా సంగీతానికి ప్రాధాన్యముంటుంది. ఐదు పాటలుంటాయి. అనూప్‌ బాణీలు ప్రధానాకర్షణగా నిలుస్తాయనే నమ్మకముంది’ అని తెలిపారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనుల్ని జరుపుతున్నట్లు, విజయదశమికి పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని ప్రారంభించి నవంబర్‌లో షూటింగ్‌ మొదలుపెడతామని నిర్మాత చెప్పారు. logo