బుధవారం 03 జూన్ 2020
Cinema - Jan 28, 2020 , 23:37:57

ప్రయాణంలో పదనిసలు

ప్రయాణంలో పదనిసలు

బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘అనుకున్నది  ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్యబాలకృష్ణ, త్రిధాచౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘భాగ్యనగరానికి చెందిన నలుగురు యువతుల కథ ఇది. స్నేహితురాలి డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం గోవా వెళతారు. అక్కడ ఏం జరిగిందన్నది ఆసక్తిని పంచుతుంది. మలుపులు ఆసక్తిని పంచుతాయి.  న్యూ ఏజ్‌ సినిమాగా తెలుగు ప్రేక్షకులకు నవ్యమైన అనుభూతిని పంచుతుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌, ప్రచార చిత్రాలకు చక్కటి స్పందన లభిస్తున్నది’ అని చెప్పారు.   రఘుబాబు, హిమజ, సమీర్‌, రఘు కారుమంచి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి  ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: ఎల్‌ఎన్‌ వారణాసి, వైజేఆర్‌, సినిమాటోగ్రఫీ: శేఖర్‌ గంగమోని, సంగీతం: వికాస్‌ బడిజ. 


logo