e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home News Anu Malik: ఇజ్రాయెల్‌కు గోల్డ్ మెడ‌ల్‌.. అడ్డంగా దొరికిపోయిన మ్యూజిక్ డైరెక్ట‌ర్‌.. ఏం జ‌రిగింది?

Anu Malik: ఇజ్రాయెల్‌కు గోల్డ్ మెడ‌ల్‌.. అడ్డంగా దొరికిపోయిన మ్యూజిక్ డైరెక్ట‌ర్‌.. ఏం జ‌రిగింది?

టోక్యో: ఒలింపిక్స్‌లో సోమవారం ఇజ్రాయెల్ త‌న తొలి గోల్డ్ మెడ‌ల్ గెలిచింది. అప్ప‌టి నుంచీ ట్విట‌ర్‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ అను మాలిక్(Anu Malik) ట్రెండింగ్‌లో ఉన్నాడు. అస‌లు ఇజ్రాయెల్ గోల్డ్ గెల‌వ‌డం ఏంటి.. ఇక్క‌డ ఇండియా అను మాలిక్ ట్రెండింగ్‌లో ఉండ‌టం ఏంటి అనిపిస్తుందా? దీని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం ఉంది. 1996లో అజ‌య్ దేవ్‌గ‌న్ న‌టించిన దిల్‌జ‌లే మూవీ ఎంత పెద్ద హిట్టో తెలుసు క‌దా. ముఖ్యంగా అందులోని మేరా ముల్క్‌.. మేరా దేశ్ సాంగ్‌.. సూప‌ర్ డూప‌ర్ హిట్‌. ఇప్ప‌టికీ పంద్రాగ‌స్ట్‌, రిప‌బ్లిక్ డేల‌నాడు ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది.

ఈ సాంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అను మాలిక్‌కు మంచి పేరే తెచ్చి పెట్టింది. అయితే సినిమా రిలీజైన 25 ఏళ్ల‌కు ఇప్పుడు ఇజ్రాయెల్ గోల్డ్ మెడ‌ల్ గెల‌వ‌డంతో ఈ సాంగ్ వెన‌క ఉన్న సీక్రెట్ తెలిసిపోయింది. సాధారణంగా ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ గెలిచిన దేశం జాతీయ గీతాన్ని ప్లే చేస్తార‌న్న విష‌యం తెలుసు క‌దా. అలా ఇజ్రాయెల్ జిమ్నాస్ట్ ఆర్టెమ్ డోల్గోప్యాట్ గెలిచిన స‌మ‌యంలోనూ ఇజ్రాయెల్ జాతీయ గీతాన్ని ప్లే చేశారు. అది విన‌గానే.. ఈ పాటెక్క‌డో విన్న‌ట్లుందే అనిపించింది.

- Advertisement -

ఇక్క‌డే అను మాలిక్ అడ్డంగా దొరికిపోయాడు. అత‌డు ఆ మేరా ముల్క్ సాంగ్‌ను ఈ ఇజ్రాయెల్ జాతీయ గీతం నుంచే కాపీ కొట్టాడ‌న్న విష‌యం తెలిసిపోయింది. ఇక అప్ప‌టి నుంచీ ట్విట‌ర్‌లో అను మాలిక ట్రెండింగ్‌లో ఉన్నాడు. ప్ర‌పంచంలో 193 దేశాలున్నాయి.. అను మాలిక్ కాపీ కొట్ట‌డానికి ఇంకా 192 ఉన్నాయి అని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. కింద ఇజ్రాయెల్ జాతీయ గీతంతోపాటు ఆ మూవీ సాంగ్‌కు సంబంధించిన వీడియో కూడా ఉంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana