గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 10, 2020 , 23:24:41

కరోనా నేపథ్యంలో..

కరోనా నేపథ్యంలో..

‘నేటి ప్రపంచ పరిస్థితికి అద్దం పట్టేలా మా ‘యాంటీ వైరస్‌' చిత్రం వుంటుంది. కరోనా మహామ్మరితో అస్తవ్యస్తంగా మారిన ప్రపంచమంతా వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూసే క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వచ్చిందనేది ఈ చిత్రం కథ’ అంటున్నారు దర్శకుడు సుభాష్‌. ఆయన దర్శకత్వంలో రాజ్‌కుమార్‌, అనుషా, నందిత ముఖ్యతారలుగా తెరకెక్కిన చిత్రం ‘యాంటీ వైరస్‌' ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో, నిర్మాత రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘ ప్రస్తుతం వర్తమాన పరిస్థితులకు దర్పణంలా ఈ సినిమా వుంటుంది. సినిమాలోని ప్రతి సన్నివేశం ఆసక్తిని పంచుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మురళి లియోన్‌.