గురువారం 04 జూన్ 2020
Cinema - May 05, 2020 , 11:14:45

మెగా హీరోతో అన‌‌సూయ ఐటెం సాంగ్..!

మెగా హీరోతో  అన‌‌సూయ ఐటెం సాంగ్..!

యాంక‌ర్‌గా, నటిగా అల‌రిస్తున్న అన‌సూయ అప్ప‌డప్పుడు స్పెష‌ల్ సాంగ్స్‌తో అలరిస్తున్న సంగ‌తి తెలిసిందే. సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన విన్న‌ర్ సినిమాలో సూయ సూయ అంటూ ప‌ల‌క‌రించిన ఈ అమ్మ‌డు ఎఫ్ 2లోను స్పెష‌ల్ సాంగ్‌తో అల‌రించింది. తాజాగా రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి స్టెప్పులేయ‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. 

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' పేరుతో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ముఖ్య పాత్ర పోషిస్తుండ‌గా ఆయ‌న‌తో క‌లిసి అన‌సూయ స్పెష‌ల్ సాంగ్ చేయ‌నుంద‌నే టాక్ వినిపిస్తుంది. ఇప్ప‌టికే ఈ సినిమాలో చిరుతో క‌లిసి రెజీనా మాస్ సాంగ్ చేయ‌గా, అన‌సూయ స్పెష‌ల్ డ్యాన్స్‌పై క్లారిటీ రావ‌ల‌సి ఉంది . ఈ సినిమాలో చరణ్‌కు చెల్లెలి పాత్రలో నిహారిక కొణిదెల నటించనుందని సమాచారం.  


logo