శుక్రవారం 03 జూలై 2020
Cinema - Mar 20, 2020 , 11:45:46

నిర్భ‌య దోషుల ఉరిపై స్పందించిన అన‌సూయ‌

నిర్భ‌య దోషుల ఉరిపై స్పందించిన అన‌సూయ‌

యాంక‌ర్‌గా, న‌టిగా తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ‌. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మ‌డు స‌మాజంలో జ‌రిగే మంచి చెడ్డ‌ల‌పై త‌ర‌చుగా స్పందిస్తూ ఉంటుంది. నెటిజ‌న్స్ హ‌ద్దులు దాటినా కూడా వారికి చుర‌క‌లంటిస్తుంటుంది. తాజాగా నిర్భ‌య దోషుల‌కి ఉరి వేయ‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ పెట్టింది.

‘ఇన్‌సాఫ్‌కి సుభాహ్.. దేర్ సే హి సహీ’ అంటూ హిందీలో పోస్టు పెట్టింది అన‌సూయ . న్యాయోదయం... తీర్పు లేట్ అయిన‌, స‌రైన‌దే జ‌రిగింది  అంటూ అర్థం వచ్చేలా హిందీలో ట్వీట్ చేసింది. అన‌సూయ చాలా రోజుల త‌ర్వాత ఇలా హిందీలో ట్వీట్ చేయ‌డంపై నెటిజ‌న్స్ చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌స్తుతం అన‌సూయ ప‌లు షోస్‌తో పాటు సినిమాల‌లో నటిస్తున్న విష‌యం తెలిసిందే. చిరు 152వ చిత్రంలో అన‌సూయ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్టు స‌మాచారం. logo