శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Sep 18, 2020 , 19:28:57

తెలుగు కమ్యూనిటీ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో అక్కినేని 97 వ జయంతి

తెలుగు కమ్యూనిటీ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో అక్కినేని 97 వ జయంతి

అమెరికా, ఇండియా కి చెందిన వంశీ ఇంటర్నేషనల్ ,లండన్ కి చెందిన తెలుగు కమ్యూనిటీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21వ తేదీన భారత కాలమాన ప్రకారం సాయంత్రం 6.30  దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత,పద్మ విభూషణ్, నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 97వ జయంతిని అంతర్జాల కార్యక్రమంగా సమర్పించనున్నారు. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ  జాతీయ పురస్కారం, డాక్టర్ జొన్నలగడ్డ మూర్తికి అక్కినేని - వంశీ వైద్య రత్న పురస్కారం బహూకరించనున్నారు. 


అమెరికా గానకోకిల శారద ఆకునూరి హ్యూస్టన్ ఆధ్వర్యంలో నిర్వహింపబడే ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటి  జమున రమణా రావు, మాజీ పార్లమెంట్ సభ్యులు, సినీ నటులు ఎమ్. మురళీమోహన్, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ నటి రోజా రమణి,  సినీగేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, తానా అధ్యక్షులు జై శేఖర్ తాళ్లూరి, ANR  ఇంటర్నేషనల్ ఫౌండర్ డా. ప్రసాద్ తోటకూర TC & UK అధ్యక్షులు వీర బ్రహ్మ రెడ్డి పడాల, సినీనటి కలైమామణి సత్యప్రియ, డాక్టర్ శ్రీనివాస రెడ్డి  ఆళ్ళ, అమెరికా,  రాధా J. శర్మ అమెరికా,  డాక్టర్ బాబురావు చాపరాల, లండన్,  డాక్టర్ భారతి చాపరాల, లండన్, డా  కె.వివేకానంద మూర్తి, లండన్,  డా. నగేష్ చెన్నుపాటి,లండన్,  డా. రామ్ మల్లవరపు,  విశాఖ, డా.బి. మురళీ కృష్ణ విశాఖ,  ప్రొ.డేనియల్ నేజర్స్, ఫ్రాన్స్,  రత్న కుమార్ కవుటూరు, వ్యవస్థాపకులు శ్రీ సాంస్కృతిక కళాసారధి, సింగపూర్, జయశ్రీ తేలు కుంట్ల, వంశీ క్యాన్సర్ ఫౌండేషన్, అమెరికా,  డా. తెన్నేటి సుధ అధ్యక్షురాలు వంశశి, శైలజ సుంకరపల్లి, మేనేజింగ్ ట్రస్టీ, ఈ సభలో పాల్గొననున్నారు..అపర ఘంటసాల బాల కామేశ్వరరావు తాతా అక్కినేని సుమధురగీతాలు ఆలపించనున్నారు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo