శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 26, 2020 , 17:46:09

మాల్దీవుల్లో మ‌రో భామ..స్టిల్స్‌, వీడియోలు వైర‌ల్

మాల్దీవుల్లో మ‌రో భామ..స్టిల్స్‌, వీడియోలు వైర‌ల్

విజ‌య‌ద‌శ‌మి, బాణం చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించింది మ‌రాఠీ భామ వేదిక‌. ఆ త‌ర్వాత త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ప‌లు సినిమాలు చేసింది. గ‌తేడాది బాల‌కృష్ణతో క‌లిసి రూలర్ సినిమాలో మెరిసింది. వ‌రల్డ్ ఫేమ‌స్ టూరిజం స్పాట్ మాల్దీవుల‌కు వెళ్లిన సెల‌బ్రిటీల జాబితాలో వేదిక కూడా చేరిపోయింది. వేదిక ఇటీవ‌లే మాల్దీవుల‌కు త‌న కుటుంబం, స్నేహితుల‌తో క‌లిసి వెళ్లింది. సీ ప్లేన్ లో మాల్దీవుల్లోని రిసార్ట్స్ లో ల్యాండ్ అయింది. బీచ్ తీరంలో పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందాలు ఆర‌బోస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది.

స‌ముద్రం నీటిలో స‌ర‌దాగా షికార్లు కొట్టింది. ప‌సందైన వంట‌కాల‌ను ఆర‌గించింది. స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని ఇసుకు తిన్నెల్లో క‌లియ‌తిరిగింది. వేదిక మాల్దీవుల వెకేష‌న్ ఫొటోలు, వీడియోలు ఇపుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.  ప్ర‌స్తుతం వేదిక జంగిల్ అనే చిత్రంలో న‌టిస్తోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.