శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 14, 2020 , 13:28:32

ముంబై టు హైద‌రాబాద్‌..మ‌కాం మార్చ‌నున్న మ‌రో న‌టి!

ముంబై టు హైద‌రాబాద్‌..మ‌కాం మార్చ‌నున్న మ‌రో న‌టి!

కొంద‌రు హీరోయిన్లు వివిధ భాష‌ల్లో న‌టిస్తూ దేశ‌వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంటార‌నే సంగ‌తి తెలిసిందే. పుట్టి పెరిగిన స్థ‌లం, భాష‌తో సంబంధం లేకుండా బ‌హుభాషా చిత్రాల్లో న‌టిస్తూ ఫాలోవ‌ర్ల‌ను పెంచుకుంటారు. వృత్తి రీత్యా షూటింగ్ ల్లో పాల్గొనాల్సి వచ్చిన‌పుడు  తాత్కాలికంగా అద్దెకు ఉండాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. దీంతో అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో సొంతంగా ఇళ్లు కొనుగోలు చేసుకుంటారు. ఇలాంటి ప‌రిస్థితుల‌కు చెక్ పెట్టేందుకు టాలీవుడ్ న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్ ప్లాన్ చేసుకుంటుంద‌ట‌.

ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో కూడా బిజీ కావ‌‌డంతో..ముంబై నుంచి త‌న మ‌కాంను హైద‌రాబాద్ కు మార్చానుకుంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. హైద‌రాబాద్ లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసి..కుటుంబాన్ని సిటీకి తీసుకురావాల‌ని ఫిక్స్ అయింద‌ట‌. త‌న‌కు అభిరుచుల‌కు అనుగుణంగా ఉండే ఫ్లాట్ ను వెతికే ప‌నిలో ఉన్న‌ట్టు టాక్‌. ఇప్ప‌టికే అందాల తార‌లు ర‌కుల్ ప్రీత్ సింగ్‌, రాశీ ఖ‌న్నా ఇండ్ల‌ను కొనుక్కొని సెటిల్ అయిన సంగ‌తి అంద‌రికీ తెలుసు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo