సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Oct 09, 2020 , 16:38:45

యాడ్ లో మ‌రో యువ‌న‌టుడు

యాడ్ లో మ‌రో యువ‌న‌టుడు

టాలీవుడ్ యాక్ట‌ర్ల‌లో వివిధ బ్రాండ్ల‌ను ప్ర‌మోట్ చేస్తున్న వారిలో ప్ర‌ముఖంగా వినిపించే పేరు మ‌హేశ్ బాబు. ఈ స్టార్ హీరో చాలా సంవ‌త్స‌రాల నుంచి మార్కెట్‌లో ప‌లు బ్రాండ్ల ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంంటున్నారు. ఇటీవ‌లే టాలీవుడ్ హీరో రామ్ కూడా తొలిసారిగా గార్నియ‌ర్ మ్యాన్ షాంపును ఎండార్స్ చేస్తున్న‌ట్టు ఓ వీడియో ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ జాబితాలో మ‌రో కుర్ర హీరో చేరిపోయాడు. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌ర‌నుకుంటున్నారా..? భీష్మ చిత్రంతో మంచి హిట్ కొట్టి ఇటీవ‌లే ఓ ఇంటివాడైన నితిన్‌.

మార్కెట్ లో వ‌న్ ఆఫ్ ది బ్రాండ్ గా ఉన్న ఓ సాఫ్ట్ డ్రింక్  క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌లో న‌టిస్తున్నాడు నితిన్‌. దీనికోసం యాడ్ ఫొటో షూట్ లో పాల్గొన్నాడు. ఈ ఫొటోలను ట్విట‌ర్ ద్వారా షేర్ చేయ‌గా..అవి నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్ర‌స్తుతం నితిన్ న‌టిస్తోన్న రంగ్ దే చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo