ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 09, 2020 , 21:06:55

షూటింగ్ కు రెడీ అంటోన్న మ‌రో స్టార్ హీరో..!

షూటింగ్ కు రెడీ అంటోన్న మ‌రో స్టార్ హీరో..!

లాక్ డౌన్ తో కొంత‌కాలంగా విశ్రాంతి తీసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్ బీర్ క‌పూర్..ఇపుడు ఫుల్ ఎన‌ర్జీతో షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. ప్ర‌స్తుతం ఈ యువ న‌టుడు బ్ర‌హ్మాస్త్ర‌, శంషీరా చిత్రాల్లో న‌టిస్తున్న‌సాడు. బ్ర‌హ్మాస్త్ర షూటింగ్ ఇప్ప‌టికే 60 శాతం పూర్త‌వ‌గా..క‌రోనాతో మిగిలిన షూట్ మిగిలింది. మ‌రోవైపు క‌రోనా లాక్ డౌన్ తో శంషీరా షూటింగ్ కూడా వాయిదా ప‌డింది. తాజా స‌మాచారం ప్ర‌కారం శంషీరా చిత్ర‌యూనిట్ ఈ నెల‌లోనే చిత్రీక‌ర‌ణ షురూ చేసేందుకు ప్లాన్ చేస్తుంద‌ట‌. క‌ర‌ణ్ మ‌ల్హోత్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీ పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కుతుంది.

య‌శ్ రాజ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై ఆదిత్యాచోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2022లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ట‌. మొత్తానికి ఇలాంటి ప‌రిస్థితుల్లో అక్షయ్ కుమార్ త‌ర్వాత షూటింగ్ కు రెడీ అవుతున్న బాలీవుడ్ స్టార్ ర‌ణ్ బీర్ క‌పూర్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo