సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Oct 01, 2020 , 11:27:41

ప్రాంతీయ చిత్రాల‌కు ప్ర‌సిద్ది చెందిన న‌ర‌సింహ ద‌ర్శ‌క‌త్వంలో..

ప్రాంతీయ చిత్రాల‌కు ప్ర‌సిద్ది చెందిన న‌ర‌సింహ ద‌ర్శ‌క‌త్వంలో..

జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం, నంది అవార్డు చిత్రాల దర్శకుడు నరసింహ నంది దర్శకత్వంలో అక్టోబర్ 15వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభం. ఈ సినిమా ఆస్కార్ అవార్డ్‌లో నిలవాలి అనే  టార్గెట్‌ పెట్టుకున్నారు.‌ కరోనా లాక్‌డౌన్ లో ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో  తీసుకునే నిర్ణయాల‌ వల్ల  ఒక ప్రేమ జంట జీవితం ఎలా చిన్నాభిన్నం అయింది.. అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు నరసింహ నంది అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. 2011లో '1940 లో ఒక గ్రామం' అనే చిత్రానికి జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు, 3 నంది అవార్డులు వచ్చాయి.

2013లో 'కమలతో నా ప్రయాణం' చిత్రానికి నంది అవార్డు వచ్చింది. 2016లో 'లజ్జా' సినిమాను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి పంపడం జరిగింది. ఇటీవలే యూత్ కోసం 'డిగ్రీ కాలేజ్' అనే సినిమా తీసానుస అని అన్నారు. ఈ కొత్త చిత్రానికి DOP మురళి మోహన్ రెడ్డి. సంగీతం సుకుమార్‌. ఎడిటర్ నాగిరెడ్డి మొద‌లైన‌వారు సాంకేతికంగా పనిచేస్తున్నారు. అందరూ కొత్త నటీనటులను పరిశీలిస్తున్నారు. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించే ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం అన్నారు దర్శకుడు నరసింహ నంది.


logo