శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 23, 2020 , 16:40:26

బిగ్ బాస్ హౌజ్ కు మరో హీరోయిన్...? ఎవరంటే..?

బిగ్ బాస్ హౌజ్ కు మరో హీరోయిన్...? ఎవరంటే..?

హైదరాబాద్ : బిగ్‌బాస్ హౌజ్ కు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనున్నది. ఐపీఎల్ జరుగుతున్నా క్రేజ్ తగ్గించుకోకుండా దూసుకుపోతున్న బిగ్‌బాస్ మరింత ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు సిద్ధమవుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు వారాల్లోనే రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చేసింది. ముచ్చటగా మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి జంప్ జిలానీ సినిమా హీరోయిన్‌ స్వాతి దీక్షిత్ ను బిగ్ బాస్-4 సీజన్ లోకి వెల్కమ్ చెప్పనున్నది. చిచ్చుపెట్టడం, చెదరగొట్టడం బిగ్ బాస్ స్టైల్. వీటి కోసమే సపరేట్ టాస్క్ లు ప్లాన్ చేస్తారు. ఇప్పుడు వచ్చే కొత్త హీరోయిన్ తో షోలో వేడెక్కించడంతో పాటు హౌజ్ కు మరింత గ్లామర్ జోడించనున్నారు. ఇప్పటికే కుమార్ సాయి, అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.