శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Mar 16, 2020 , 19:32:17

మహేష్‌బాబు ఖాతాలో మరో దర్శకుడు!

మహేష్‌బాబు ఖాతాలో మరో దర్శకుడు!

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో  ఏ దర్శకుడికి హిటొచ్చినా..వెంటనే ప్రిన్స్‌ మహేష్‌బాబు దృష్టి ఆ దర్శకుడిపై పడుతుంది. తన తదుపరి చిత్రం ఆ దర్శకుడితో చేస్తున్నట్లుగా వార్తలు కూడా వస్తాయి. అయితే అందులో కార్యరూపం దాల్చే సినిమాలు చాలా తక్కువ. గతంలో సుకుమార్‌కు ‘రంగస్థలం’ లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ రాగానే వెంటనే సుకుమార్‌తో సినిమా చేస్తున్నానని ప్రకటించాడు మహేష్‌. అయితే కథ విషయంలో మహేష్‌ ధోరణి నచ్చని ఈ దర్శకుడు ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత వంశీ పైడిపల్లితో  తన తదుపరి సినిమా వుంటుంది అనౌన్స్‌ చేసిన ఈ యువహీరో ఇప్పుడు అతనితో కూడా సినిమా లేదని తేల్చేశాడు. కాగా గత కొన్ని రోజులుగా మహేష్‌ దర్శకుడి ఖాతాలో  ‘గీతగోవిందం’ దర్శకుడు పరశురామ్‌ చేరాడు. త్వరలోనే ఈ దర్శకుడితో సినిమా వుంటుందని అనుకునే లోపే తాజాగా ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుముల ఈ లిస్ట్‌లో చేరాడు. ఇటీవల ‘భీష్మ’ సినిమా చూసిన మహేష్‌తో వెంకీని కలిసి కథ తయారుచేసుకోని రమ్మని చెప్పాడని టాలీవుడ్‌ సమాచారం. సో.. చూద్దాం ఈ వెంకీ కుడుములనైనా మహేష్‌ కరుణిస్తాడో లేదో.. చూడాలి. logo