శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 12:56:21

దుబాయ్ కు మకాం మార్చిన స్టార్ హీరో..!

దుబాయ్ కు మకాం మార్చిన స్టార్ హీరో..!

బాలీవుడ్ సెల్ర‌బిటీలు సోనూ నిగ‌మ్‌, ద‌లెర్ మ‌హెందీ, కుమార్ స‌నుతోపాటు ప‌లువురు తార‌లు ఇప్ప‌టికే త‌మ మకాంను దుబాయ్ కు మార్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల టాలీవుడ్ స్టార్ హీరో ప్ర‌భాస్ కూడా దుబాయ్ లో మంచి విల్లా కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే దుబాయ్ కు ఇంటిని షిప్ట్ చేస్తున్న స్టార్ హీరోల జాబితాలో మ‌రో న‌టుడు చేరిన‌ట్టు బీటౌన్ లో టాక్ వినిపిస్తోంది.   కోలీవుడ్ స్టార్ హీరో మాధ‌వ‌న్ దుబాయ్ కు మ‌కాం మార్చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

దుబాయ్ లోని ప‌లాజో వెర్స‌సేలో 5 స్టార్ రెసిడెన్సి ప్రాప‌ర్టీని కొనుగోలు చేసిన‌ట్టు ఇన్ సైడ్ టాక్. త్వ‌ర‌లోనే త‌న ప‌నుల‌న్నింటినీ దుబాయ్ నుంచే చ‌క్క‌బెట్టుకునేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు చర్చ న‌డుస్తోంది. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజ‌ముంద‌నే విష‌యంపై మాధ‌వ‌న్ నుంచి క్లారిటీ వ‌స్తే అర్థ‌మ‌వుతుంది. ఒక‌వేళ‌ ఇదే నిజ‌మైతే మాధ‌వ‌న్ ఇక నుంచి అభిమానులకు అందుబాటులో ఉండే అవ‌కాశం ఉండ‌దు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.