గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 13, 2020 , 15:42:58

మ‌రో బాలీవుడ్ న‌టుడికి క‌రోనా పాజిటివ్‌

మ‌రో బాలీవుడ్ న‌టుడికి క‌రోనా పాజిటివ్‌

ఇప్ప‌టికే ప‌లువురు బాలీవుడ్ న‌టీన‌టులు క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఇటీవలే అర్జున్ క‌పూర్, అత‌ని గ‌ర్ల్‌ఫ్రెండ్ మ‌లైకా అరోరాకు పాజిటివ్ గా నిర్దారణ అయింది. తాజాగా మ‌రో బాలీవుడ్ న‌టుడు అఫ్తాబ్ శివ్ ద‌స‌ని క‌రోనా బారిన ప‌డ్డాడు. ఈ విష‌యాన్ని ట్విట‌ర్ లో షేర్ చేశాడు అఫ్తాబ్‌. డాక్ట‌ర్లు,  అధికారులు జ‌రిపిన ప‌రీక్ష‌లో దుర‌దృష్ట‌వ‌శాత్తు నాకు కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో నన్ను హోం క్వారంటైన్ లో ఉండాల‌ని డాక్ల‌రు సూచించారని అఫ్తాబ్ ట్వీట్ చేశాడు.

త‌న‌తో స‌న్నిహితంగా మెలిగిన వారు కూడా ప‌రీక్ష‌లు చేయించుకొని, పాజిటివ్ వ‌స్తే డాక్ట‌ర్ల స‌ల‌హాలు, సూచ‌ల‌ను పాటించాల‌ని అఫ్తాబ్ కోరాడు. అఫ్తాబ్ శివ్ ద‌స‌ని ఇటీవలే త‌న భార్య నిన్ దుసంజ్ తో కలిసి ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ను ప్రారంభించాడు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo