రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అన్నాత్తే. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లోఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఇటీవల చిత్రానికి సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులకి మంచి వినోదాన్నిపంచాయి. దీపావళి సందర్భంగా చిత్రాన్ని నవంబర్ 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో ప్రమోషన్ స్పీడ్ కూడా పెంచింది.
రజనీకాంత్ తన అభిమానులకి పండగ సందడిలాంటి ఓ కొత్త కబురుని వినిపించారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమా టీజర్ ఈ నెల 14న విడుదల కానున్నట్టు తెలియజేశారు.ఈ టీజర్ ప్రకంపనలు పుట్టిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌కి జోడీగా నయనతార నటిస్తున్నారు. కీర్తిసురేశ్, మీనా, ఖుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డి. ఇమ్మన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శివ మరియు ఆది నారాయణ కథ ను అందిస్తున్నారు. సవరీ ముత్తు, శివ, ఆంటోనీ భాగ్యరాజ్, చంద్రన్ పచైముత్తులు డైలాగ్స్ అందిస్తున్నారు.