ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 15, 2020 , 10:26:13

సుశాంత్ నా ఫ్లాట్‌కు ఈఎంఐలు క‌డుతున్నాడ‌నేది అబ‌ద్ధం

సుశాంత్ నా ఫ్లాట్‌కు ఈఎంఐలు క‌డుతున్నాడ‌నేది అబ‌ద్ధం

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ మ‌ర‌ణంకి సంబంధించి అనేక కోణాల‌లో దర్యాప్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌నీ ల్యాండ‌రింగ్ విష‌యంలో ఇప్ప‌టికే రియా చ‌క్ర‌వ‌ర్తితో పాటు ఆమె కుటుంబాన్ని ప‌లుమార్లు విచారించారు ఈడీ. ఇక సుశాంత్ మాజీ గార్ల్ ఫ్రెండ్ అంకితాకి సంబంధించిన ఓ ఫ్లాట్‌కు సుశాంత్ ఈఎంఐలు క‌డుతున్నాడ‌నే వార్త బ‌య‌ట‌కు రాగా, ఈ విష‌యంపై కూడా ఈడీ అధికారులు ఫోక‌స్ పెడుతున్నట్టు స‌మాచారం.

మ‌లాడ్‌లోని రూ. 4.5 కోట్లు ఖ‌రీదు చేసే ఫ్లాట్‌లో ప్ర‌స్తుతం అంకితా నివ‌సిస్తుండగా, ఇది సుశాంత్ కొనిచ్చాడ‌ని బ‌య‌ట ప్ర‌చారం జ‌రుగుతుంది.  ఈ విష‌యం అంకితా దృష్టికి వెళ్ల‌గా ఆమె వెంట‌నే త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఫ్లాట్ రిజిస్ట్రేష‌న్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్స్‌ను షేర్ చేస్తూ.. నెల‌వారీ నా ప్రాతిప‌దిక‌న ఖాతా ఇది. ఇంత‌కు మించి నేను ఏమి చెప్ప‌న‌వ‌స‌రం లేదంటూ ట్విట్ట‌ర్‌లో రాసుకొచ్చింది. నా ఫ్లాట్‌ని నేనే కొనుక్కున్నాను త‌ప్ప సుశాంత్ కొనివ్వ‌లేదంటూ చెప్పుకొచ్చింది అంకితా.


logo