సోమవారం 25 జనవరి 2021
Cinema - Dec 03, 2020 , 00:08:50

అంజలి ప్రేమాయణం

అంజలి ప్రేమాయణం

పూర్ణ, తేజ  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్యాక్‌డోర్‌'.  కర్రి బాలాజీ దర్శకుడు. బి.శ్రీనివాస్‌రెడ్డి నిర్మాత. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ ‘ఇందులో అంజలి అనే పాత్రలో కనిపిస్తా. తనకంటే వయసులో చిన్నవాడైన  ఓ అబ్బాయి ప్రేమ కోసం పరితపించే యువతిగా నా పాత్ర ఛాలెంజింగ్‌గా ఉంటుంది. నా కెరీర్‌లో మంచి సినిమాగా నిలిచిపోతుందనే నమ్మకముంది’ అని తెలిపారు. “బ్యాక్‌డోర్‌' ఎంట్రీ వల్ల ఎదురయ్యే పరిణామాల్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నాం. సందేశం, ప్రేమ, వినోదం, భావోద్వేగాల సమాహారంగా  ఉంటుంది.  పూర్ణ నటన, పాత్ర చిత్రణ ఆకట్టుకుంటాయి’ అని దర్శకుడు తెలిపారు. రెండో షెడ్యూల్‌ పూర్తయిందని, పతాక ఘట్టాలు మాత్రమే బ్యాలెన్స్‌గా ఉన్నాయని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్‌,  ఛాయాగ్రహణం: శ్రీకాంత్‌ నారోజ్‌. logo