బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 00:54:43

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో

అనిల్‌  రావిపూడి దర్శకత్వంలో

ప్రేమకథలతో పాటు ప్రయోగాత్మక కథాంశాలకు ప్రాముఖ్యతనిస్తూ వరుసగా సినిమాల్ని అంగీకరిస్తున్నారు నాగచైతన్య. తాజాగా ఆయన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. కుటుంబ విలువలు, వినోదం, ప్రేమ అంశాల మేళవింపుతో ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు తెలిసింది. వాణిజ్య హంగుల కలబోతగా దర్శకుడు సిద్ధం చేసిన కథ నచ్చడంతో నాగచైతన్య ఈ సినిమాలో నటించడానికి అంగీకారం చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహుగారపాటి, హరీష్‌పెద్ది ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు  చెబుతున్నారు. ప్రస్తుతం శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో‘లవ్‌స్టోరీ’ సినిమా చేస్తున్నారు నాగచైతన్య.
logo