శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 25, 2020 , 18:07:09

యూట్యూబ్ వీడియోలు చూసి న‌న్ను సెలెక్ట్ చేశాడు

యూట్యూబ్ వీడియోలు చూసి న‌న్ను సెలెక్ట్ చేశాడు

పాపుల‌ర్ సింగర్‌, న‌టి శిర్లే సెటియా తెలుగు లో హీరోయిన్ గా తెరంగేట్రం చేస‌ప్తున్న విష‌యం తెలిసిందే. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న ఈ ప్రాజెక్టులో నాగశౌర్య హీరో. హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇస్తున్న విష‌యంపై మీడియా ప్ర‌శ్నించ‌గా శిర్లే సెటియా మాట్లాడుతూ..నాకు తెలుగు భాష అర్థం కాదు. నేను చాలా ద‌క్షిణాది సినిమాలు చూశాను. వారు చాలా ఫ్యాష‌నేట్ గా ఉంటారు. నాకు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేయాలన్న ఆలోచ‌న రావ‌డం అద్భుతమైన విష‌యం. ఈ సినిమా చేస్తున్నందుకు చాలా ఎక్స‌యిటింగ్ గా ఉంద‌ని చెప్పింది. .

డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ యూట్యూబ్ వీడియోలు చూసి న‌న్ను సంప్ర‌దించాడు. వీడియో కాల్ ద్వారా స్క్రిఫ్ట్ విన్నా..క‌థ క‌ట్టిప‌డేయడంతో వెంట‌నే ఒకే చెప్పేశాను. నా గ‌మ్యం ఇంకేదో ఉంది. మొద‌ట నేను సింగ‌ర్‌ను. ఇపుడు న‌టిని. తెలుగు సినిమా ప్ర‌క‌ట‌న‌తో నా కోరిక తీర‌బోతుంద‌ని చెప్పుకొచ్చింది. డిసెంబ‌ర్ తొలి వారంలో ఈ చిత్రం షూటింగ్ మొద‌లుకానుంది.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.