గురువారం 04 మార్చి 2021
Cinema - Jan 18, 2021 , 01:23:13

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ యాంకర్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ యాంకర్

ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ప్రకృతి ప్రేమికుల్లో స్ఫూర్తిని నింపుతూ అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ గ్రీన్‌ఇండియాచాలెంజ్‌లో ఆదివారం బిగ్‌ బాస్‌ ఫేమ్‌ అరియానా గ్లోరీ పాల్గొన్నది. సొహెల్‌ నుంచి చాలెంజ్‌ను స్వీకరించిన ఆమె జూబ్లీహిల్స్‌లోని పార్కులో       మొక్కలు నాటింది. పచ్చదనాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉన్నదని అరియానా గ్లోరీ తెలిపింది. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న యాంకర్‌ ప్రత్యూష ఆదివారం జూబ్లీహిల్స్‌లోని పార్కులో  మొక్కలు నాటింది.  ఎంపీ సంతోష్‌కుమార్‌గారు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళుతున్నారని ప్రత్యూష కొనియాడింది.  

VIDEOS

logo