శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 29, 2020 , 17:25:57

సుడిగాలి సుధీర్ కామెంట్..హ‌ర్ట్ అయిన విష్ణుప్రియ..!

సుడిగాలి సుధీర్ కామెంట్..హ‌ర్ట్ అయిన విష్ణుప్రియ..!

తెలుగులో ఫీమేల్ యాంకర్స్ కు కొదవ లేదు. పైగా ఇప్పుడొస్తున్న ముద్దుగుమ్మలకు అందాలు ఆరబోయడానికి ఎలాంటి మొహమాటం కూడా లేదు. హీరోయిన్స్ కంటే తామేం తక్కువ కాదని రెచ్చిపోతున్నారు. బికినీలు కూడా వేస్తున్నారు. అనసూయ, సుమ, రష్మి గౌతమ్ లాంటి స్టార్ యాంకర్స్ ను పక్కనబెడితే ఆ తర్వాత వర్షిణి, వర్ష, విష్ణుప్రియ లాంటి యాంకర్స్ తమ సత్తా చూపించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అవకాశం వచ్చిన ప్రతీసారి రచ్చ చేస్తూనే ఉన్నారు. అలా తనకంటూ గుర్తింపు కోసం పాకులాడుతున్న బ్యూటీ విష్ణుప్రియ. సుడిగాలి సుధీర్‌తో చేస్తున్న పోవే పోరా షో ఈమెకు మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే ఈమె ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంది.

దానికి సంబంధించిన ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈమె చెక్ మేట్ అనే సినిమాతో వస్తుంది. అప్పుడెప్పుడో పూర్తైన ఈ చిత్రం ఇప్పుడు విడుదలవుతుంది. షూటింగ్ కోసమే చాలా ఏళ్లు తీసుకున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా బికినీ వేయడమే కాదు లిప్ లాక్ సీన్స్ కూడా చేసింది విష్ణుప్రియ. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అమ్మో ఈ అమ్మాయేనా ఇంత అందాల అరాచకం చేసింది అనుకోక తప్పదు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే సుడిగాలి సుధీర్ పై కూడా కొన్ని కామెంట్స్ చేసింది విష్ణు. ఇందులో సుధీర్ హీరో ఫ్రెండ్ పాత్రలో చిన్న కమెడియన్ గా నటించాడని తెలిపింది. తమ ఇద్దరికి స్క్రీన్ స్పేస్ లేదని.. కలిసి కనిపించలేదని.. ఉన్నాడని తెలిసి షాక్ అయ్యానని చెప్పింది.

అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత సుధీర్ చాలా హర్ట్ అయ్యాడని.. కాస్త పర్సనల్ గా తీసుకున్నాడని తెలిపింది విష్ణుప్రియ. వాళ్ల సినిమాలు చూసినపుడు తానెప్పుడూ అలా ఫీల్ అవ్వలేదని.. కానీ సుధీర్ అలా అనుకున్నాడని తెలిపింది. అలా అనుకుంటాడనే ఐడియా కూడా తనకు లేదని.. సినిమా ట్రైలర్ చూసిన తర్వాత పర్సనల్ గా తీసుకుని హర్ట్ కావడం ఏంటో అంటూ చెప్పుకొచ్చింది విష్ణుప్రియ. సుధీర్ సినిమా విడుదలైనపుడు మనస్పూర్తిగా బాగుందని చెప్పినట్లు గుర్తు చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఏదేమైనా కూడా పోవే పోరాతో ఈ ఇద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. ఆ స్నేహంతోనే ఇద్దరూ ఒకరినొకరు అనుకుంటుంటారు కూడా. ఇప్పుడు కూడా విష్ణుప్రియ ఇలాగే అనుంటుంది అంటున్నారు నెటిజన్లు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.