మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 14, 2020 , 18:23:18

రూమ‌ర్ల‌కు చెక్ పెట్టిన సుమా క‌న‌కాల‌

రూమ‌ర్ల‌కు చెక్ పెట్టిన సుమా క‌న‌కాల‌

స్టేజ్ ఎక్కిందంటే ఎంతటి క్లిష్ట‌ప‌రిస్థితుల్లో అయినా స్పాంటేనియ‌స్‌గా మాట్లాడుతూ అంద‌రినీ క‌డుపుబ్బా న‌వ్వించే యాంక‌ర్‌గా పేరు ద‌క్కించుకున్న‌ది సుమా క‌న‌కాల‌. యాంక‌రింగ్‌లో త‌న‌కెవ‌రూ సాటిలేర‌ని అభిమానుల్లో చెద‌ర‌ని ముద్ర వేసుకున్నారు. ఇటు బుల్లితెర‌ను ఒక ఆట ఆడుకుంటూనే కుటుంబ వ్య‌వ‌హారాలు కూడా స‌వ్యంగా నిర్వ‌హిస్తున్న‌ది సుమా. ప్రేమ వివాహం చేసుకున్న సుమా, రాజీవ క‌న‌కాల బంధంపై కొన్నిరోజులుగా పుకార్లు వ‌స్తున్నాయి. వీరి మ‌ధ్య ఏవో గొడ‌వ‌లు జ‌రిగాయి. సుమా రాజీవ్‌ల‌కు మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయంటూ వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఈ వార్త‌ల‌ను ఖండిస్తూ సుమా తాజాగా  తన సోషల్ మీడియా ఖాతాలో భర్త రాజీవ్ కనకాలపై ఉన్న ప్రేమను వ్యక్తంచేస్తూ ఎమోషనల్ కామెంట్స్‌తోపాటు ఒక ఫోటో షేర్‌ చేసింది. ''రాజా! ఎప్ప‌టికీ నువ్వే నా జీవితం.. నువ్వే నా సర్వస్వం'' అని భావోద్వేగపూరిత కామెంట్ చేసింది సుమ. దీనికి నెటిజ‌న్లు ల‌వ్లీ క‌పుల్, బ్యూటిఫుల్ క‌పుల్‌, ఎవ‌ర్‌గ్రీన్ జోడి. అంద‌రినీ న‌వ్వించే సుమా నువ్వు బాధ‌ప‌డొద్దు అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 


logo