ఎప్పుడా ఎన్నడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 మొదలైంది, అప్పుడే వారం రోజులు కూడా పూర్తి చేసుకుంటుంది. 19 మంది సభ్యులు ఇంట్లోకి ప్రవేశించగా వారిలో ఒకరు నేడు బిగ్ బాస్ హౌజ్‌ని వీడనున్నారు. కాగా, శనివారం నాగ్ తనదైన స్టైల్లో ఎంట్రీ ఇవ్వగా, అందరిని కూల్‌గానే పలకరించాడు. శుక్రవారం ఏం జరిగిందో చూపించాడు.
జైల్లో ఉన్న జెస్సీ.. సరయూ తనను బూతులు తిడుతోందని చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. అతడని అలాంటి పరిస్థితిలో చూసిన కాజల్, సిరి కూడా కంటతడి పెట్టుకున్నారు. కొద్ది సేపటి తర్వాత అతనికి సరయూ సారీ చెప్పింది. అలానే జెస్సీకి కూడా జైలుశిక్ష పూర్తి కావడంతో బయటకు వచ్చేశాడు.ఇక కింగ్ నాగ్‌తో కలిసి హౌజ్‌మేట్స్ అందరు ముచ్చటించారు.
పేరుపేరున అందరని పలకరించిన నాగ్.. సరయుని బూతుల మాట్లాడమని అన్నాడు. నువ్వు నీలానే ఉండు అని చెప్పాడు. షణ్నూను ‘అరేయ్ ఏంట్రా ఇది? కొంచెం కనబడరా, వన్ వీక్ అయిపోయింది. ఆట మొదలెట్రా’ అని అన్నాడు. మిగతా కంటెస్టెంట్స్‌కు కూడా ధైర్యం అందించాడు నాగ్.
ఎప్పటిలానే హౌజ్ మేట్స్‌తో ఓ గేమ్ ఆడించాడు, ఎవరితో సెట్, ఎవరితో కట్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఒక కంటెస్టెంట్ నచ్చిన వాళ్లకు బ్యాండ్ తొడగలాని, కట్ అనుకున్న వాళ్ల ఫొటోని చింపేయాలని అన్నారు. మొదటగా ఈ వారం బెస్ట్ పర్ఫామర్ విశ్వ.. తనకు మానస్ సెట్ అని, ఇంటి పనులు చేయనన్న కాజల్‌తో కట్ అని చెప్పాడు.
అనంతరం.. జెస్సీ.. సన్నీతో సెట్, సరయూతో కట్ అని; లహరి.. ప్రియతో సెట్, కాజల్‌తో కట్ అని తేల్చేశారు. లోబో.. షణ్ముఖ్ తో సెట్, కాజల్‌తో కట్ అని వెల్లడించాడు. సరయూ వంతు రాగా.. తను ఎవరితోనూ సెట్ కాదని, వన్ మ్యాన్ ఆర్మీని అని పేర్కొంది. సిరి ఫొటోను చించేసి ఆమెతో కట్ అని చెప్పకనే చెప్పింది. శ్వేత.. యానీ మాస్టర్‌తో సెట్, ఉమాదేవితో కట్ అని; శ్రీరామచంద్ర.. శ్వేతతో సెట్, కాజల్‌తో కట్ అని; సన్నీ.. హమీదాతో సెట్, రవితో కట్ అని చెప్పారు.
సిరి ..షణ్ముఖ్‌తో సెట్ , సరయూతో కట్ అని ఫొటో చించి చెత్తబుట్టలో పడేసింది. నటరాజ్ మాస్టర్…లోబోతో సెట్, కాజల్ తో కట్ అని క్లారిటీ ఇచ్చేశాడు. మానస్.. రవితో సెట్, జెస్సీతో కట్ అని చెప్పగా; రవి.. పింకీతో సెట్, జెస్సీతో కట్ అని వెల్లడించాడు. ఉమాదేవి.. పింకీతో సెట్, కాజల్‌తో కట్ అని చెప్పింది. హమీదా.. సరయూతో సెట్, షణ్నూతో కట్ అని; ప్రియ… అనీ మాస్టర్‌తో సెట్, హమీదాతో కట్ అని; పింకీ.. ప్రియతో సెట్, నటరాజ్ మాస్టర్‌తో కట్ అని; కాజల్.. శ్రీరామచంద్రతో సెట్, ఉమాదేవితో కట్ అని చెప్పేశారు.
అనీ మాస్టర్.. శ్వేతతో సెట్, కాజల్‌తో కట్ అంది. షణ్నూ.. రవితో సెట్, హమీదాతో కట్ అని చెప్పాడు. అనంతరం తన గార్ల్ ఫ్రెండ్ దీప్తి అని కూడా చెబుతూ సిగ్గుపడిపోయడు. మొత్తానికి ఈ వారం నామినేషన్లో ఆరుగురు ఉండగా అందులో రవి, హమీదాని సేవ్ చేసిన బిగ్ బాస్ ఈ రోజు మానస్, కాజల్, సరయూ, జెస్సీ లలో ఒకరిని ఇంటికి పంపనున్నారు.