బుధవారం 20 జనవరి 2021
Cinema - Nov 23, 2020 , 20:10:44

యాంకర్ ప్రదీప్ కు చిరంజీవి షాక్ ఇచ్చాడ‌ట‌..!

యాంకర్ ప్రదీప్ కు చిరంజీవి షాక్ ఇచ్చాడ‌ట‌..!

ప్రదీప్ మాచిరాజు..ఈ పేరుకు ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే బుల్లితెరపై మనోడు మకుటం లేని మహారాజు. ఫీమేల్ యాంకర్స్ లో సుమ ఎలాగో.. మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కూడా అలాగే. ఈయనకు అదిరిపోయే ఇమేజ్ ఉంది. ముఖ్యంగా రియాలిటీ షోలతో పాటు ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నాడు ప్రదీప్. తాజాగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా కూడా మారిపోయాడు ప్రదీప్ మాచిరాజు. అంతకు ముందే కొన్ని సినిమాల్లో నటించాడు కూడా. అయితే ఇప్పుడు సోలో హీరోగా నటిస్తున్నాడు ప్రదీప్. ఇదిలా ఉంటే ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు చిరంజీవి ఎదురైన ఓ అరుదైన సంఘటన గురించి గుర్తు చేసుకున్నాడు. తనకు యాంకర్ గా అప్పుడప్పుడే గుర్తింపు వస్తున్న సమయంలో ఓ సారి చిరు ఇంటికి వెళ్లానని చెప్పుకొచ్చాడు ప్రదీప్. 

అప్పుడు మెగాస్టార్ ఇచ్చిన షాక్ తో తనకు కొన్ని రోజుల వరకు నిద్ర కూడా పట్టలేదంటున్నాడు ఈయన. చిరంజీవి ఇంటికి వెళ్లినపుడు ఆయన ఎంతో మర్యాదగా పలకరించిన తీరుకు ఫిదా అయిపోయానంటున్నాడు. అంతపెద్ద నటుడు తనలాంటి చిన్న యాంకర్ తో ప్రవర్తించిన తీరు చిరు అంటే ఏంటో చూపించింది అంటున్నాడు. ఆయన అంత పెద్ద మెగాస్టార్ ఎలా అయ్యాడో అప్పుడే అర్థమైంది అంటున్నాడు ప్రదీప్. ఎందుకంటే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ ఒకేలా మర్యాద ఇవ్వడం చిరంజీవికి తెలుసని..తనను రిసీవ్ చేసుకున్న తీరుతోనే అది అర్థమైపోయిందంటున్నాడు ప్రదీప్. 

అంతేకాదు తనను ప్రేమగా పేరు పెట్టి పిలవడమే కాకుండా మీ వాయిస్ చాలా బాగుంటుందండీ.. మీరు పలికే తెలుగు పదాలు కూడా నాకు చాలా యిష్టం అంటూ చిరంజీవి చెప్పగానే గాల్లో ఉండిపోయానంటున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఆయన లాంటి మెగాస్టార్ తన భాషను మెచ్చుకోవడంతో అసలు కిందకి రాలేకపోయానంటున్నాడు. తన జీవితంలో అది అతిపెద్ద ప్రశంస అంటున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు చిరంజీవిని కలిసినా ప్రతీసారి ఆయన నుంచి అదే మర్యాద చూసానంటున్నాడు. పక్కవాళ్లను రిసీవ్ చేసుకునే తీరు నిజంగా అద్భుతం అంటున్నాడు మాచిరాజు. ఏదేమైనా కూడా ఓ రకంగా ఆ రోజు ఇంటికి వెళ్తే చిరంజీవి తనకు షాక్ ఇచ్చాడంటున్నాడు ప్రదీప్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo