మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 29, 2020 , 10:01:10

బడా రాజకీయ నాయకుడి కుమార్తెతో ప్రదీప్ వివాహం..!

బడా రాజకీయ నాయకుడి కుమార్తెతో ప్రదీప్ వివాహం..!

బుల్లితెర‌పై త‌న‌దైన మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరిస్తున్న పాపుల‌ర్ యాంక‌ర్ ప్ర‌దీప్. ఇటీవ‌ల ఓ ద‌ళిత యువ‌తి.. ప్ర‌దీప్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. డాలర్ బాయ్ ఒత్తిడి వల్లే యాంకర్ ప్రదీప్ పేరు చెప్పాన‌ని, వారి నుంచి డబ్బులు గుంజడానికే డాలర్‌ బాయ్‌ ఈ కుట్ర పన్నినట్లు పేర్కొన్నది. క‌ట్ చేస్తే ప్ర‌దీప్ పెళ్ళి పీట‌లెక్కేందుకు సిద్ధ‌మ‌య్యాడ‌ని స‌మాచారం.

ఈ ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ గా ఉన్న సెల‌బ్రిటీలు ఒక్కొక్క‌రుగా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. తాజాగా ప్ర‌దీప్ మాచిరాజు ఓ ఇంటివాడు కావ‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌ని టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ప్ర‌దీప్ చేసుకోబోయే అమ్మాయి ..  ఓ బడా రాజకీయ నాయకుడి కుమార్తె అని అంటున్నారు. ప్రస్తుతం ప్ర‌దీప్  కుటుంబం పెళ్లికి సంబంధించిన ప‌నుల‌తో నిమ‌గ్న‌మైన‌ట్టు ఫిలింన‌గ‌ర్ టాక్. కాగా, ప్ర‌దీప్ హీరోగా న‌టించిన తొలి చిత్రం  30 రోజుల్లో ప్రేమించడం ఎలా అతి త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


logo