శనివారం 06 జూన్ 2020
Cinema - May 16, 2020 , 14:40:13

బిగ్‌బాస్ 4పై యాంక‌ర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్‌

బిగ్‌బాస్ 4పై యాంక‌ర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్‌

టాక్ ఆఫ్ ది టౌన్‌తో యాంక‌ర్‌గా గుర్తుంపు తెచ్చుకున్న ఝాన్సీ. వీర‌నారిలా టీవీ షోలు, సినిమాల్లో దూసుకుపోతుంది. సీనియ‌ర్ యాంక‌ర్ల నుంచి యంగ్ యాంక‌ర్ల వ‌ర‌కు పోటీ ఇస్తూనే ఉంది. మ‌ల్లేశం సినిమాలో అమ్మ పాత్ర‌కు మంచి పేరు తెచ్చుకున్న‌ది. మ‌ల్టీ టాలెంటెడ్ అయిన ఝాన్సీని బిగ్‌బాస్ సీజ‌న్ 4లో కంటెస్టెంట్‌గా అవ‌కాశం వ‌స్తే వెళ్తావా అన్న ప్ర‌శ్న‌కు.. 'నాకు ఆస‌క్తి లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పేసింది. బిగ్‌బాస్ 1లో ఆఫ‌ర్ వ‌స్తేనే వెళ్ల‌లేదు. ఇప్పుడు వెళ్తానా... తెలిసి తెలిసి రాయి ప‌ట్టుకొని ప‌ళ్లు ఊడ‌కొట్టుకుంటారా ఎవ‌రైనా.. నాలుగు గోడ‌ల మ‌ధ్య న‌న్ను నేను బాధ‌పెట్టుకోవ‌డం నాకు ఇష్టం లేద‌ని' ఓ ఇంట‌ర్వూలో చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇండ‌స్ట్రీకి ఎలా ప‌రిచ‌యం అయింది, ఎవ‌రు తీసుకువ‌చ్చారు అనే విష‌యాల‌ను కూడా పంచుకున్న‌ది ఝాన్నీ.logo