శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Apr 02, 2020 , 17:35:36

లంగాజాకెట్‌లో మెరిసిన అన‌సూయ‌.. ఏంటి ప్రత్యేకత?

లంగాజాకెట్‌లో మెరిసిన అన‌సూయ‌.. ఏంటి ప్రత్యేకత?

ట్రెండ్‌ను ఫాలో అవుతూ ట్రెండ్ సెట్ చేస్తున్న‌ది అన‌సూయ‌. ఎప్పుడూ ఫ్యాష‌న్‌, ట్రెండీ డ్రెస్స‌ల్లో  క‌నిపించే అన‌సూయ శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా లంగా జాకెట్‌లో క‌నిపించింది.బుల్లితెర న‌టుల్లో అన‌సూయ‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ‌. దీనికి తోడు త‌ర‌చూ ఆమె సోష‌ల్ మీడియాలో స్పందిస్తుంటుంది. శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా ఆమె ప్ర‌త్యేక అలంక‌ర‌ణ‌లో ఫొటోలు దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్ర‌త్యేకంగా లంగా జాకెట్‌లో ఫొటోలు దిగింది. జ‌డ‌లో పూలు పెట్టుకొని పాత సినిమాల్లో హీరోయిన్‌లా దిగిన ఆమె ఫొటోలు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి. ట్రెడిష‌న‌ల్ లుక్‌లో క‌నిపించిన అన‌సూయ ఫొటోలకు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.


logo