బుధవారం 03 జూన్ 2020
Cinema - May 05, 2020 , 11:26:24

అన‌సూయ ట్వీట్..ఆస‌క్తిక‌ర చర్చ‌

అన‌సూయ ట్వీట్..ఆస‌క్తిక‌ర చర్చ‌

హాట్ బాంబ్ అన‌సూయ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌. ఆమె చేసే ట్వీట్స్ ఒక్కోసారి బాంబుల్లా పేల‌తాయి. తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో మ‌న‌వ‌ర‌కు వ‌స్తే కాని బుద్ధి రాద‌న్న మాట‌.. అంటూ ట్వీట్ చేసింది. దీంతో అన‌సూయ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొంద‌రు విజ‌య్ దేవ‌ర‌కొండ వ్య‌వ‌హారం గురించే ఇలాంటి కామెంట్ చేసింద‌ని చ‌ర్చించుకుంటున్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ  ‘మిడిల్ క్లాస్ ఫండ్’ పేరిట రూ.25 లక్షలతో నిధిని ఏర్పాటు చేశారు. అలానే మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించేలా 'ది దేవరకొండ ఫౌండేషన్' స్థాపించాడు. వీటిపై కొన్ని వెబ్‌సైట్స్ త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించి త‌న ప్ర‌తిష్ట‌ని దెబ్బ తీస్తున్నాయ‌ని ఫైర్ అయ్యాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆయ‌న‌కి మ‌ద్ద‌తుగా మ‌హేష్‌,ర‌వితేజ‌, అనీల్ రావిపూడి, అల్ల‌రి న‌రేష్ త‌దిత‌రులు స‌పోర్ట్‌గా నిలిచారు. కాగా, గ‌తంలో కొన్ని  వెబ్‌సైట్స్ త‌ప్పుడు క‌థ‌నాల‌పై ప‌లుమార్లు ఫైర్ అయిన అన‌సూయ‌కి మ‌ద్ద‌తు ల‌భించలేదు. ఈ నేప‌థ్యంలోనే తాను ఈ రోజు ఆ ట్వీట్ చేసి ఉంటుంద‌ని నెటిజ‌న్స్ భావిస్తున్నారు. logo