గురువారం 04 మార్చి 2021
Cinema - Jan 28, 2021 , 21:23:30

అన‌సూయ‌ 'థ్యాంక్ యూ బ్రదర్' ట్రైలర్ రివ్యూ..!

అన‌సూయ‌ 'థ్యాంక్ యూ బ్రదర్' ట్రైలర్ రివ్యూ..!

అనసూయ భరద్వాజ్ మరోసారి అదరగొట్టింది. ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు వస్తున్నా కూడా ఆచుతూచి సినిమాల విషయంలో అడుగులు వేస్తుంది అనసూయ. ఈ క్రమంలోనే ఇప్పుడు అనసూయ నుంచి వస్తున్న సినిమా థ్యాంక్ యూ బ్రదర్. వినడానికి టైటిల్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ కూడా అంతే ఆసక్తికరంగా అనిపిస్తుంది. పైగా ఎమోషన్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇందులో అనసూయ గర్భవతిగా నటిస్తుంది. రమేష్ రాపర్తి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ఈ జబర్దస్త్ యాంకర్ కు ఉన్న క్రేజ్ కారణంగా సినిమాకు కూడా మంచి హైప్ వచ్చింది.. ఆసక్తి కూడా పెరిగిపోతుంది. పోస్టర్ విడుదలైనపుడే సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం కూడా కలుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. 

ప్రెగ్నెన్సీతో ఉన్న అనసూయ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాంతో మరోసారి గర్భవతి అయిన అనసూయ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇదే విషయంపై ఈమె కూడా ఓపెన్ అయిపోయింది. ఇలాంటి పాత్ర చేయడం నిజంగానే ఆనందంగా ఉందని.. రమేష్ రాపర్తి చెప్పిన వెంటనే కథకు బాగా కనెక్ట్ అయిపోయాను అని చెప్పింది అనసూయ భరద్వాజ్. ఈ సినిమాలో అశ్విన్ విరాజ్ హీరోగా నటిస్తున్నాడు. రియల్ లైఫ్ లో ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తనకు అమ్మ పాత్ర చేయడం అంటే ఎంత తీయని అనుభూతి ఇస్తుందో తెలుసు అంటుంది అనసూయ. రీల్ లైఫ్‌లో కాదు.. రియల్ లైఫ్‌లో కూడా మరోసారి గర్భం దాల్చడానికి తనకేం అభ్యంతరం లేదని సంచలన కామెంట్స్ చేసింది అనసూయ. 

ఇద్దరు పిల్లల్ని కన్న తనకు మాతృత్వంలో ఉన్న అనుభూతి ఎలాంటిదో తెలుసని.. అందుకే మూడోసారి కూడా ఆ మాధుర్యాన్ని పొందడానికి సిద్ధమే అని చెప్పుకొచ్చింది. అలాగే 'థ్యాంక్ యు బ్రదర్' సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని చెప్పింది. కథ పరంగా చూస్తే ఓ కుర్రాడు, గర్భంతో ఉన్న అనసూయ ఓ లిఫ్టులో ఇరుక్కుపోతారు. అదే సమయంలో అనసూయకు నొప్పులు వస్తాయి..అప్పుడు ఆ కుర్రాడు ఏం చేస్తాడు..ఎలా ఆమెను కాపాడాడు అనేది కథ. మనసుకు హత్తుకునేలా ఉన్న ఈ ట్రైలర్ కచ్చితంగా సినిమాపై అంచనాలు పెంచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ చిత్రంతో అనసూయ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

ట్రైల‌ర్ పై ఓ లుక్కేయండి మ‌రి..


ఇవి కూడా చ‌ద‌వండి..

టీజర్‌కు ముందు ప్రీ టీజర్..ప్రమోషన్స్ కేక‌

సోనూసూద్ కోసం 2 వేల కి.మీ సైక్లింగ్‌..!

జాన్వీక‌పూర్ కు 'వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ' న‌చ్చ‌లేదా..?

20 నిమిషాలు..కోటి రెమ్యున‌రేష‌న్..!

శృతిహాస‌న్ ప్రియుడు ఇత‌డే..ఫాలోవ‌ర్స్ కు క్లారిటీ !

అన‌సూయ‌ 'థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ ' ట్రైల‌ర్

‘ఓటిటి’ కాలం మొద‌లైన‌ట్టేనా..?

తండ్రికి స్టార్ హీరో విజయ్ లీగల్ నోటీసులు..!

వ‌రుణ్ ధావ‌న్ ఇక న‌టించ‌డేమో..? 'జెర్సీ' భామ‌ సెటైరిక‌ల్ పోస్ట్

చిక్కుల్లో నాని 'అంటే సుంద‌రానికి '..!

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo