మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 28, 2021 , 17:05:43

సస్పెన్స్ గా అన‌సూయ‌ 'థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ ' ట్రైల‌ర్

సస్పెన్స్ గా అన‌సూయ‌ 'థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ ' ట్రైల‌ర్

అన‌సూయ భ‌ర‌ద్వాజ్, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం 'థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్‌'. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ అండ్ మోష‌న్ పోస్ట‌ర్ కు మంచి స్పంద‌న వచ్చింది. తాజాగా మేక‌ర్స్ ట్రైల‌ర్ తో ఆడియెన్స్ ను ప‌లుక‌రించారు. ట్రైల‌ర్ ను టాలీవుడ్ యాక్ట‌ర్ వెంక‌‌టేశ్ విడుద‌ల చేశాడు. ట్రైల‌ర్ విడుద‌లైంది. చిత్ర‌యూనిట్ స‌భ్యులంద‌రికీ  ఆల్ ది బెస్ట్ అని వెంక‌టేశ్ ట్వీట్ చేశాడు.

ప్రెగ్నెంట్ గా ఉన్న అన‌సూయ లిఫ్ట్ లో వెళ్తుండ‌గా విరాజ్ అశ్విన్ అదే లిఫ్ట్‌లో ఉంటాడు. అనసూయ తాగుతున్న వాటిల్ బాటిల్  లోని నీళ్లు విరాజ్ పై ప‌డ‌గా..అత‌ను అన‌సూయ‌పై చిరాకు ప‌డే స‌న్నివేశంతో ట్రైల‌ర్ షురూ అయింది. మ‌ధ్య‌లో స‌డెన్ గా లిఫ్ట్ తెగి కింద‌ప‌డుతుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేది స‌స్పెన్స్ గా ఉంది. 


‌నిన్ను క‌న్న‌పుడు ప‌డ్డ పురిటి నొప్పుల బాధ‌ను నేనిప్ప‌టికీ అనుభ‌విస్తూనే  ఉన్నాను రా అంటూ బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చే డైలాగ్స్ సస్పెన్స్ గా ఉండి..సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి. జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మేష్ రాప‌ర్తి రూపొందిస్తున్నారు.  సురేష్ ర‌గుతు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, గుణ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo