ప్రెగ్నెన్సీపై అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు..

సినిమా ఇండస్ట్రీలో పెళ్లి అయితేనే అమ్మాయిలను పట్టించుకోరు. ఇక అమ్మ అయితే తీసి పక్కన పెట్టేస్తారు. అవకాశాలు కూడా ఇవ్వరు. అందుకే పెళ్లి అయినా కూడా అమ్మ తనానికి దూరంగా ఉంటారు కొందరు హీరోయిన్లు. కానీ అనసూయ భరద్వాజ్ మాత్రం అందరికంటే భిన్నం. పెళ్లైంది.. ఇద్దరు పిల్లలకు తల్లైంది.. ఆ తర్వాత ఆమె కెరీర్ జోరందుకుంది. నిజానికి పెళ్ళికి ముందు ఈమె ఎవరికీ తెలియదు. పెళ్ళి తర్వాత అందరికీ తెలుసు.. స్టార్ అయింది కూడా. ప్రస్తుతం ఈ జబర్దస్త్ యాంకర్ కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికితోడు ఏదైనా విషయం గురించి మాట్లాడాలంటే తడబడటం.. మొహమాటపడటం అనేది అస్సలు తెలియదు. మొహం మీదే ఉన్నదున్నట్లు చెప్పడం ఈమె అలవాటు. ఇప్పుడు కూడా ఇదే చేసింది అనసూయ. తాజాగా ఈమె థ్యాంక్ యూ బ్రదర్ అనే సినిమాలో నటిస్తుంది. రమేష్ రాపర్తి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అందులో గర్భవతి పాత్రలో నటిస్తుంది అను.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ప్రగ్నెన్సీతో ఉన్న అనసూయ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో మరోసారి గర్భవతి అయిన అనసూయ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇదే విషయంపై ఈమె కూడా ఓపెన్ అయిపోయింది. ఇలాంటి పాత్ర చేయడం నిజంగానే ఆనందంగా ఉందని.. రమేష్ రాపర్తి చెప్పిన వెంటనే కథకు బాగా కనెక్ట్ అయిపోయాను అని చెప్పింది అనసూయ భరద్వాజ్. ఈ సినిమాలో అశ్విన్ విరాజ్ హీరోగా నటిస్తున్నాడు. రియల్ లైఫ్ లో ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తనకు అమ్మ పాత్ర చేయడం అంటే ఎంత తీయని అనుభూతి ఇస్తుందో తెలుసు అంటుంది అనసూయ.
రీల్ లైఫ్లో కాదు.. రియల్ లైఫ్లో కూడా మరోసారి గర్భం దాల్చడానికి తనకేం అభ్యంతరం లేదని సంచలన కామెంట్స్ చేసింది అనసూయ. ఇద్దరు పిల్లల్ని కన్న తనకు మాతృత్వంలో ఉన్న అనుభూతి ఎలాంటిదో తెలుసని.. అందుకే మూడోసారి కూడా ఆ మాధుర్యాన్ని పొందడానికి సిద్ధమే అని చెప్పుకొచ్చింది. అలాగే 'థ్యాంక్ యు బ్రదర్' సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని చెప్పింది. మొత్తానికి అనసూయ గర్భవతి కావడంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి
తాజావార్తలు
- ‘డ్రాగన్ ఫ్రూట్’ పేరు మారుతోంది..
- గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నేడే చివరి తేదీ
- బైడెన్ ప్రమాణం.. ఎంత మంది హాజరవుతున్నారో తెలుసా ?
- తెలంగాణలో కొత్తగా 267 పాజిటివ్ కేసులు
- వావ్ టీమిండియా.. ఆకాశానికెత్తిన ఆస్ట్రేలియన్ మీడియా
- పూజలు చేస్తున్న 'కాకి'.. ప్రాణంగా చూసుకుంటున్న 'మీనా'
- జల్పాయ్గురి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా
- బిలియనీర్ జాక్మా కనిపించారు..
- కప్పేసిన పొగమంచు.. పలు రైళ్లు ఆలస్యం
- యూపీలో 12 ఏండ్ల బాలికపై లైంగికదాడి, హత్య